Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్నేహితుడి చెల్లితో యశస్వి జైస్వాల్ ప్రేమాయణం..!

టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఓ విదేశీ యువతితో యశస్వి జైస్వాల్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్ అసాధారణమైన బ్యాటింగ్ అంచెలంచెలుగా ఎదిగాడు.

అండర్ 19 ప్రపంచకప్‌ 2018తో భారత క్రికెట్‌లో‌కి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున సత్తా చాటి అందరి దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లో సెంచరీల మోత మోగించి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యశస్వి జైస్వాల్.. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరును కొనసాగించాడు.

Is Yashasvi Jaiswal dating British girl Maddie Hamilton Know Everything About Her

నిలకడకు మారు పేరుగా నిలుస్తూ స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. అప్‌కమింగ్ బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌‌కు కూడా యశస్వి జైస్వాల్ ఎంపికయ్యాడు.
ఈ ఏడాది ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడిన చివరి టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అద్బుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. కేవ‌లం ఐదు మ్యాచ్‌ల్లో 712 పరుగులు చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించాడు.

ఇప్పటి వరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యశస్వి జైస్వాల్ 16 ఇన్నింగ్స్‌ల్లో 1028 పరుగులు చేశాడు. అసాధారణమైన బ్యాటింగ్‌తో అప్‌కమింగ్ స్టార్‌లా కనిపిస్తున్న యశస్వి జైస్వాల్ ప్రేమలో పడ్డాడని జోరు ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ 2024 సందర్భంగా యశస్వి జైస్వాల్ ఓ విదేశీ అమ్మాయితో కనిపించడం ఈ వార్తలకు కారణంగా నిలిచింది.

ఇంగ్లండ్‌కు చెందిన మాడ్డీ హామిల్టన్‌‌తో యశస్వి జైస్వాల్ గత మూడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఐపీఎల్ 2024 సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఈ ఇద్దరూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యింది. ఐపీఎల్‌తో పాటు జై స్వాల్ ఆడిన పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాడ్డీ హామిల్టన్ హాజరైంది.

హామిల్టన్‌తో ప్రేమలో ఉన్నట్లు కథనాలు వస్తున్నా యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఖండించలేదు. గత మూడేళ్లుగా ఈ ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హామిల్టన్ ప్రస్తుతం చుదువుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌కు కూమా హామిల్టన్ హాజరైంది. యశస్వి జైస్వాల్‌ను ఉత్సాహపరుస్తూ కనిపించింది.

హామిల్టన్ ఎవరంటే..?
ఇంగ్లండ్‌కు చెందిన హెన్రీ.. జైస్వాల్‌కు మంచి స్నేహితుడు. అతని సోదరే మాడ్డీ హామిల్టన్ అని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇంగ్లండ్‌కు వెళ్లిన ప్రతీసారి జైస్వాల్.. హెన్రీ ఇంటికి వెళ్లాడు. ఆ కుటుంబంతో జైస్వాల్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే మాడ్డీ హామిల్టన్‌తో అయిన పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు సమాచారం. భవిష్యత్తులో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Wednesday, September 11, 2024, 20:18 [IST]
Other articles published on Sep 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+