Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఛేజ్ మాస్టర్': భారత్-ఆసీస్ మ్యాచ్‌లో కోహ్లీ రికార్డులివే

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో పలు అంతర్జాతీయ రికార్డులు బద్దలయ్యాయి. ఈ మ్యాచ్‌లో 51 బంతుల్లో 82 పరుగులు చేసిన టీమిండియా 'ఛేజ్ మాస్టర్' విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన బ్యాటింగ్ గణాంకాలను మరింతగా మెరుగుపరచుకున్నాడు.

టీ20 చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత్ మెరుగైన రికార్డుని కొనసాగించింది. ఇప్పటివరకు ఆడిన ఐసీసీ ట్వంటీ 20 వరల్డ్ కప్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. 2007, 2014 టోర్నీల్లో భారత్‌ గెలిస్తే, 2010, 2012ల్లో ఆస్ట్రేలియా గెలిచింది. [అవును, క్రికెట్‌లో సచిన్ తర్వాత కోహ్లీ శకం ఆరంభం: సెహ్వాగ్]

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గణాంకాలు:

* కోహ్లీ 51 బంతుల్లో చేసిన 82 పరుగులు (నాటౌట్‌) టీ20ల్లో రెండో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు. 2016, జనవరి 16న ఆస్ట్రేలియాపై అతడి వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు 90 (నాటౌట్)గా నమోదు చేశాడు.

Is Virat Kohli India's next 'milestone man'?

* అత్యధికంగా యాభైకి పైగా స్కోరు రికార్డును కోహ్లి సమం చేశాడు. 15 సార్లు ఈ ఘనత సాధించాడు. క్రిస్ గేల్(రెండు సెంచీలు, 13 అర్ధసెంచరీలు), బ్రెండన్ మెక్ కల్లమ్(రెండు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు) సరసన నిలిచాడు.

* టీ20ల్లో విజయవంతమైన ఛేజింగ్‌లో భారత్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక స్కోరు కోహ్లిదే. [18 బంతుల్లో 39: విరాట్ కోహ్లీ ఛేదించాడిలా (ఫోటోలు)]

* 2012, సెప్టెంబర్‌‌లో కొలంబొలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 61 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దీనిని అధిగమించాడు.

* కోహ్లీ 12సార్లు యాభైకి పైగా స్కోరు చేసినప్పుడు టీమిండియా విజయం సాధించింది.

* టీ20ల్లో 9 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. షాహిద్ ఆఫ్రిది 11 సార్లు ఈ అవార్డుని అందుకుని ముందు వరుసలో ఉన్నాడు.

* ఆసీస్‌తో జరిగిన 9 మ్యాచ్‌లలో కోహ్లి మూడు సార్లు మ్యాన్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.

Is Virat Kohli India's next 'milestone man'?

* క్రిస్ గేల్, ఉమర్ అక్మల్, యువరాజ్ సింగ్‌లు ముగ్గురు ఆసీస్‌పై రెండేసి సార్లు మాత్రమే ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

* టీ20ల్లో ఒక కేలండర్ సంవత్సరంలో ఆరుసార్లు మ్యాన్ ఆఫ ద మ్యాచ్ అవార్డు అందుకుని ఎవరూ సాధించని ఘనత కోహ్లీ సాధించాడు.

* 2012లో షేన్ వాట్సన్ ఐదుసార్లు ఈ ఘనతను సాధించాడు.

* ఆసీస్‌తో భారత్ తలపడిన 13 మ్యాచ్‌‌ల్లో టీమిండియా 9 సార్లు విజయం సాధించగా, నాలుగింటిలో ఆసీస్ గెలిచింది

* టీ20 మ్యాచ్‌ల్లో కంగారూ జట్టుపై ధోనిసేన సక్సెస్ రేటు 69.23 శాతంగా ఉంది. మరే ఇతర దేశంపై కూడా ఇంత సక్సెస్ రేటుని నమోదు చేయలేదు.

* అంతేకాదు టీ20 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా 9 సార్లు మరేయితర జట్టుతో ఓడిపోలేదు.

* ఆసీస్‌ను 9 సార్లు ఓడించిన ఘనత టీమిండియాకే దక్కింది.

* 2013, అక్టోబర్ 10 నుంచి 2016 మార్చి 27 మధ్యలో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించింది. అంతకుముందు ఇంగ్లండ్ పేరిట ఉన్న ఈ రికార్డును ధోని సేన సమం చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+