For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అవును, క్రికెట్‌లో సచిన్ తర్వాత కోహ్లీ శకం ఆరంభం: సెహ్వాగ్

By Nageswara Rao

హైదరాబాద్: "భారత క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ శకం మొదలైంది" భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు ముందు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్న మాటలివి. ఏ ఉద్దేశంతో సునీల్ గవాస్కర్ మ్యాచ్‌కు ముందు ఆ మాట అన్నాడో తెలియదు కానీ, మ్యాచ్ తర్వాత ఆ మాట నిజమైందని ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

రెండు, మూడేళ్ల క్రితం వరకూ స్టేడియాల్లో వినిపించే 'సచిన్... సచిన్' స్థానంలో ఇప్పుడు 'కోహ్లీ... కోహ్లీ' అని వినిపించడం మొదలైందని అన్నారు. క్రికెట్ అభిమానుల మనసుల్లో సచిన్ స్థానం ప్రత్యేకం అయినప్పటికీ... మైదానంలో వచ్చే సరికి సచిన్ ఆ స్థానాన్ని భర్తీ చేశాడని తెలిపారు.

ఆదివారం మొహాలిలో జరిగిన మ్యాచ్‌లో 18వ ఓవర్‌లో 4, 4, 6, 2 పరుగులు కొట్టిన కోహ్లీ ఒత్తిడిలో ఉన్న భారత్ అభిమానులకు కాస్తంత ఉపశమనం కలిగించాడు. దీంతో మైదానంలో అభిమానులంతా 'కోహ్లీ... కోహ్లీ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Virat Kohli Proves His Era Has Begun, After Guiding India Into World T20 Semifinals

ఈ ఓవర్‌లోనే ఆస్ట్రేలియా జట్టు కూడా మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. గతేడాది ధోని నుంచి టెస్టు కెప్టెన్సీ తీసుకున్న తర్వాత కోహ్లీ చెలరేగి ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు కోహ్లీ ఆడితే గెలుస్తాం. లేకుంటే డౌటే... అన్నంతగా ఆటపై తనదైన ముద్ర వేశాడు.

ఆదివారం నాటి ఇన్నింగ్స్ చూసిన తర్వాత సెహ్వాగ్ సెహ్వాగ్ మరో అడుగు ముందుకేసి దేశానికి తరువాతి సచిన్ అంతటి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయేనని పొగడ్తలతో ముంచెత్తాడు. "అవును. తదుపరి సచిన్ కోహ్లీయేనని నేను గొంతెత్తి చెప్పగలను. ప్రస్తుతం టెండూల్కర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఎందుకంటే, నేను ఎదుగుతూ టెండూల్కర్ ఆటను చూశాను. అలాగే టెండూల్కర్ ఎదుగుతూ గవాస్కర్ ఆటను చూశాడు. ఇప్పుడు కోహ్లీ ఆటను చూస్తున్న వారు మరో పదేళ్ల తరువాత టీమ్‌లోకి వస్తారు" అని అన్నాడు.

"ఓ ఆటగాడు పూర్థి స్థాయి ఆట ప్రదర్శించాడనడానికి 100 శాతం ఆడాడు అంటాం. కానీ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో కోహ్లీ అంతకు మించిన ఆటతీరును కనబరిచాడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో తనకు ఎదురులేదని చాటాడు. ఒత్తిడిలో ఉన్నా ఎలా ప్రశాంతంగా ఉండాలో చూపాడు" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

Virat Kohli Proves His Era Has Begun, After Guiding India Into World T20 Semifinals

మొహాలిలో భారత్‌కు కోహ్లీ చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోహ్లీ అద్భుతమై ప్రదర్శనను కనబర్చడంతో... ఆదివారం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. 161 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.1 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

విరాట్ కోహ్లీ 51 బంతుల్లో సాధించిన 82 పరుగులు (నాటౌట్) సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు చేయాల్సిన టీమిండియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని ఛేదించి ధోని సేన సెమీస్‌కు చేరింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+