Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొన్న టీ20 .. నిన్న వన్డే.. రెపో మాపో టెస్ట్ కెప్టెన్సీ.. విరాట్ కోహ్లీకి రోజులు దగ్గరపడ్డాయా?

Is Virat Kohli Career And Captaincy Came To An End ? Here Is What You Have To Know

హైదరాబాద్: బ్యాట్స్‌మన్‌గా తిరుగులేని ఆధిపత్యం చలాయించిన్నాళ్లూ భారత క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఎదురే లేకుండా పోయింది. అనిల్‌ కుంబ్లే లాంటి దిగ్గజం కోచ్‌ అయ్యాక కోహ్లీతో విభేదాలొస్తే అతను తప్పుకోవాల్సి వచ్చింది కానీ.. కోహ్లీకి ఏ రకమైన ఇబ్బందీ రాలేదు. క్రికెట్‌ సలహా కమిటీ సభ్యుడైన సౌరవ్ గంగూలీకి రవిశాస్త్రి పట్ల ఏమాత్రం సానుకూల అభిప్రాయం లేకపోయినా.. కోహ్లీ మెచ్చాడు కాబట్టి అతన్నే కోచ్‌గా చేయాల్సి వచ్చింది. భారత క్రికెట్లో కోహ్లీ ఆధిపత్యానికి ఇవి సూచికలు.

విరాట్‌ అసమాన బ్యాటింగ్‌, జట్టును నడిపించడంలో అతడి ఉత్సాహం చూశాక.. ధోనీ సారథ్య బాధ్యతలను వదులుకోవడం కూడా ఎవరికీ ఆశ్చర్యం అనిపించలేదు. కానీ అతని ఫామ్‌ దెబ్బ తినగానే పరిస్థితులన్నీ ఎదురు తిరిగాయి. ముందుగా టీ20 కెప్టెన్సీని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడూ అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ ఊడింది. టెస్ట్ కెప్టెన్సీపై కూడా ఇంకో కత్తి వేలాడుతూనే ఉంది.

పేలవ ఫామ్‌తో

పేలవ ఫామ్‌తో

కోహ్లీ చివరిసారిగా 2019 నవంబర్‌లో సెంచరీ కొట్టాడు. అప్పుడు బంగ్లాదేశ్‌తో ఆడిన తొలి డే/నైట్‌ టెస్టులోనే విరాట్‌ కోహ్లీ 70వ అంతర్జాతీయ శతకం సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లుగా ఒక్క మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోయాడు. జట్టుని ఎంత బాగా నడిపిస్తున్నా 71వ సెంచరీ సాధించలేకపోతున్నాడు. నీళ్లు తాగినంత తేలిగ్గా ఇదివరకు శతకాల మీద శతకాలు బాదిన కోహ్లీ ఈ రెండేళ్లలో ఒక్కసారి కూడా ఆ ఫీట్‌ అందుకోలేకపోయాడు.

దీన్ని బట్టే అతడి బ్యాటింగ్‌ పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆడపాదడపా అతను పరుగులు చేసినా.. అవి విరాట్ కోహ్లీ స్థాయికి ఏ మాత్రం సరితూగేవి కావు. ఈ క్రమంలోనే వన్డే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ కాలం పాటు క్రికెట్ ఆడాలంటే తిరిగి బ్యాటింగ్‌లో మునపటి సత్తా చాటాల్సిందే.

 టెస్ట్‌ కెప్టెన్సీకి రోహిత్ ఎసరు..

టెస్ట్‌ కెప్టెన్సీకి రోహిత్ ఎసరు..

టెస్టుల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉన్న అజింక్యా రహానేను సౌతాఫ్రికా పర్యటనకు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆ వైస్‌ కెప్టెన్సీ కూడా రోహిత్‌ శర్మకే ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ఈ టెస్టు సిరీస్‌లో కోహ్లీ సారథ్యం వహిస్తే.. రోహిత్‌ అతడి డెప్యూటీగా ఉంటాడు. అలాగే సౌతాఫ్రికాలో భారత్‌ ఇప్పటివరకు ఒక్క టెస్టు సిరీస్‌ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియాలో రాణించినట్టే ఇక్కడా కోహ్లీ టెస్టు సిరీస్‌ గెలిపిస్తే.. ఇది కూడా చారిత్రక ఘట్టం అవుతుంది.

అయితే, ఇక్కడ కోహ్లీ కేవలం కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ రాణించాలి. ఎందుకంటే రహానే, పుజారా లాంటి సీనియర్లు కూడా గత కొంత కాలంగా ఏమాత్రం ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడటం లేదు. మరోవైపు పలువురు యువకులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ సైతం భారీ ఇన్నింగ్స్‌ ఆడి మునుపటి ఫామ్‌ అందుకోవాలి. లేదంటే టెస్టు కెప్టెన్సీ కూడా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు.

రాణిస్తే తిరుగులేదు..

రాణిస్తే తిరుగులేదు..

వన్డే కెప్టెన్‌గా తనపై వేటు వేయడాన్ని అవమానంగా భావిస్తే మాత్రం విరాట్ కోహ్లీకే నష్టం చేస్తుంది. ఇలాంటి అనుభవాలను ఎంతోమంది దిగ్గజాలు ఎదుర్కొన్న విషయాన్ని అతను గ్రహించాలి. కెప్టెన్‌గా వ్యవహరించింది కొంత కాలమే అయినా.. సచిన్‌ ఇబ్బందికర రీతిలోనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

ఆస్ట్రేలియాకు అప్రతిహత విజయాలందించిన పాంటింగ్‌ సైతం వేటును ఎదుర్కోక తప్పలేదు. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి కోహ్లీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కోహ్లి ప్రస్తుత పరిస్థితికి కారణం బ్యాటింగ్‌ జోరు తగ్గడమే. దాన్ని ఇప్పుడు గాడిన పెట్టుకోవడమే తన ముందున్న కర్తవ్యం. సౌతాఫ్రికా పర్యటనతో పాటు వచ్చే ఏడాది కోహ్లీకి కేరీర్ పరంగా చాలా కీలకం.

2023 వన్డే ప్రపంచకప్‌ ఆడటం డౌటే..

2023 వన్డే ప్రపంచకప్‌ ఆడటం డౌటే..

వచ్చే ఏడాది విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ పరంగా అగ్ని పరీక్షే అని చెప్పాలి. మునపటిలా సత్తా చాటితేనే అతను జట్టులో ఉంటాడు. లేకుంటే అతని చోటు కూడా గల్లంతవుతుంది. సీనియర్ బ్యాట్స్‌మన్‌, మాజీ కెప్టెన్‌గా అతనికి ఓ లిమిట్‌వరకే అవకాశాలు ఇస్తారు. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత విరాట్‌దే. అలా కాదని విఫలమైతే మాత్రం.. అతని స్థానంలో యువ ఆటగాడిని ఆడించడం ఖాయం.

విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ వెనుకేసుకొచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వినడు. సత్తా చాటే ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలనేది ద్రవిడ్ ఆలోచన. ఇప్పటికే తన మార్క్ కోచింగ్ చూశాం. విఫలమవుతున్న రహానేను తప్పించిన విషయం తెలిసిందే. కోహ్లీ విఫలమైతే.. 2023 వన్డే ప్రపంచకప్ కూడా ఆడకుండానే కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కోహ్లీ జాన్ జిగ్రీ.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సైతం పోతూ పోతూ కోహ్లీకి రోజులు దగ్గరపడ్డాయనే చెప్పుకుంటూ పోయాడు. కాబట్టి కెరీర్ నిలబెట్టుకునేది? ముగింపు పలికేది కోహ్లీ చేతుల్లోనే ఉంది.

Story first published: Thursday, December 9, 2021, 16:30 [IST]
Other articles published on Dec 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+