డాక్టర్‌గా మారనున్న టీమిండియా క్రికెటర్!
సాధారణంగా క్రీడాకారులు తమ కెరీర్ కోసం చదువుపై పెద్దగా శ్రద్ద పెట్టరు. ఒకవేళ ఫోకస్ పెట్టినా.. కెరీర్ కోసం మధ్యలోనే వదిలేస్తారు. అందుకే చాలా మంది స్టార్ క్రికెటర్లు, వరల్డ్ బెస్ట్ ప్లేయర్లకు కూడా కనీస విద్యార్హత డిగ్రీ కూడా ఉండదు.
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ఇంటర్మీడియట్‌తోనే చదవును ఆపేయగా.. ధోనీ డిగ్రీని మధ్యలో వదిలేసాడు. కెరీర్‌లో బిజీగా ఉండటంతో ఈ దిగ్గజ ఆటగాళ్లంతా చదువును పక్కనపెట్టేసారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే క్రీడా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నత చదువులు చదివారు.
బాగా చదువుకున్న క్రికెటర్..
అలాంటి అరుదైన జాబితాలోకి టీమిండియా ఆల్‌రౌండర్, ఆర్‌సీబీ స్టార్ వెంకటేశ్ అయ్యర్ వస్తాడు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక విద్యార్హత కలిగిన ఏకైక ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతి త్వరలోనే అతను డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌గా మారిపోనున్నాడు.

క్రికెట్‌తో పాటు చదువులో రాణిస్తున్న సవ్యసాచి వెంకటేశ్ అయ్యర్. ఇండోర్‌లోని ప్రఖ్యాత 'దేవి అహల్యా విశ్వవిద్యాలయం' నుంచి వెంకటేశ్ అయ్యర్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో MBA (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశాడు.
15 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి..
ఇండోర్‌లోని ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (IMS) నుంచి B.Com (బ్యాచిలర్ ఆఫ్ కామర్స్) డిగ్రీ పట్టా అందుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలను కూడా క్లియర్ చేశారు. ఆ సమయంలోనే ఆయనకు 'బిగ్ ఫోర్' అకౌంటింగ్ సంస్థల్లో ఒకటైన డెలాయిట్ నుంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో 15 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం కూడా వచ్చింది. కానీ క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగ అవకాశాన్ని వదులుకుని పూర్తిస్థాయి క్రికెటర్‌గా మారాడు.
అయినా తనకు ఇష్టమైన చదువును వెంకటేశ్ అయ్యర్ పక్కనపెట్టలేదు. ఐపీఎల్‌తో పాటు టీమిండియా తరఫున కోట్లు ఆర్జించినా.. చదువుపై తన మక్కువను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఫినాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. త్వరలోనే డాక్టర్ వెంకటేశ్ అయ్యర్‌గా మారిపోనున్నాడు.
క్రీడలతో పాటు చదువు ముఖ్యమే..
ఈ తరం క్రీడాకారులంతా వెంకటేశ్ అయ్యర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ఏ రంగంలో రాణించినా చదువును అశ్రద్ద చేయవద్దని హితవు పలుకుతున్నారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెప్పారు. అథ్లెట్లు తమ క్రీడలతో పాటు చదువులపై కూడా ఫోకస్ పెట్టాలని సూచించారు. అందరికి సక్సెస్ రాదని, అలాంటి పరిస్థితుల్లో చదువు ఉపయోగపడుతుందని చెప్పారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

