Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్.. గే? ఫొటో వైరల్!

World Cup 2023: టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ స్వలింగ సంపర్కుడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా అతనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. శుభ్‌మన్ గిల్ గే అంటూ కొందరు అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తున్నారు.

ముంబైలోని జియోవరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శుభ్‌మన్ గిల్.. తన క్లోజ్ ఫ్రెండ్‌తో కలిసి ఫొటోలకు ఫోజిచ్చాడు. అబ్బాయి అయిన సదరు ఫ్రెండ్.. అమ్మాయిలా శుభ్‌మన్ గిల్ భుజాలపై తలను పెట్టి ఫోజిచ్చాడు. దాంతోఅతను గే అని, శుభ్‌మన్ గిల్ కూడా స్వలింగ సంపర్కుడేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Is Team India Openener Shubman Gill Gay?

గే ఫ్రెండ్‌తోనే కాకుండా టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడని, హోటల్ రూమ్‌లో ఈ ఇద్దరూ ఒకే రూమ్‌ను షేర్ చేసుకోవడం.. మైదానంలో చనువుగా ఉండటం ఇందుకు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదే కార్యక్రమానికి సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ హాజరు కావడం.. శుభ్‌మన్ గిల్ తమ కామన్ ఫ్రెండ్‌ను వాటేసుకోవడం చర్చనీయాంశమైంది.

ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని, పబ్లిక్‌గానే తిరుగుతున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీమిండియా యువ ఓపెనర్‌గా సత్తా చాటుతుండటంతో సచిన్ ఈ ఇద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దాంతో ఈ ఇద్దరూ బాహటంగానే తిరుగుతున్నారని రాసుకొస్తున్నారు. జియోవరల్డ్ ప్రారంభోత్సవానికి శుభ్‌గిల్ బ్లాక్ కలర్ జాకెట్ వేసుకోని రాగా... సారా టెండూల్కర్ రెడ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించింది.

శుభ్‌మన్ గిల్ గే ఫ్రెండ్.. సారా టెండూల్కర్‌తో కూడా క్లోజ్‌గా ఫోటో దిగడం చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరికీ అతనే కామన్ ఫ్రెండ్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వరల్డ్ కప్ 2023 ముందు వరకు వరుస సెంచరీలతో జోరు కనబర్చిన శుభ్‌మన్ గిల్ అసలు టోర్నీలో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన గిల్.. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెంగ్యూ బారిన తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన గిల్.. పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 16 పరుగులే చేసిన గిల్.. బంగ్లాదేశ్‌తో 53 పరుగులతో సత్తా చాటాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 26 పరుగుల చేసిన గిల్.. ఇంగ్లండ్‌తో 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. తదుపరి మ్యాచ్‍ల్లోనైనా గిల్ పుంజుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Story first published: Wednesday, November 1, 2023, 21:13 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+