సింగర్ తమ్ముడితో స్మృతి మంధాన ప్రేమాయణం!
హైదరాబాద్: 'స్మృతి మంధాన'..క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ భారత మహిళా టీమ్ వైస్ కెప్టెన్ ఆట కంటే అందానికే అభిమానులున్నారు. ఆమెకు యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోయిన్ తలపించే ఆమె కోసం కుర్రాళ్లు పడి చచ్చిపోతారు. చాలా మంది ఆమె ఫొటోలను ప్రొఫైల్ పిక్స్‌గా పెట్టుకుంటారు.
అయితే స్మృతి మంధాన ఓ సింగర్ తమ్ముడితో డేటింగ్ చేస్తుందనే వార్తలు కుర్రాళ్లను కుదేలు చేస్తున్నాయి. బాలీవుడ్ ఫేమస్ సింగర్ పలక్ ముచ్చల్ తమ్ముడు పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన ప్రేమాయాణం నడిపిస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఈ ఇద్దరు కూడా బాహటంగానే చెట్టాపట్టాలేసుకొని తిరగడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే తమ డేటింగ్ వార్తలకు సంబంధించి అటు స్మృతి మంధాన, ఇటు పలాష్ ముచ్చల్ ఒక్క మాట మాట్లాడలేదు. తమ ప్రేమాయణాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
పలాష్ ముచ్చల్ ఓ మ్యూజిక్ కంపోజర్. మహారాష్ట్రకు చెందిన అతనికి సోషల్ మీడియా వేదికగా మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ హీరోను తలపించే అతని ఆహార్యానికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఈడు జోడీ కుదిరిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
పలాష్ ముచ్చల్ చేతిపైన ఎస్‌ఎం అనే టాటూ ఉండటం.. అతనితో మంధాన అత్యంత సన్నిహితంగా ఫొటోలు దిగడం వీరి మధ్య ఏదో బంధం ఉందనే ప్రచారానికి కారణమైంది.

ప్రస్తుతం ఇంగ్లండ్ వేదికగా ది హండ్రెడ్ లీగ్ ఆడుతున్న స్మృతి మంధానా.. తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఈ సీజన్‌లో తొలి పరుగు.. మొదటి ఫోర్.. ఫస్ట్ సిక్సర్, తొలి అర్థశతకంతో పాటు ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్‌గా మంధాన నిలిచింది.
ది హండ్రెడ్ లీగ్ ముగిసిన తర్వాత ఆసియా గేమ్స్‌లో భారత జట్టును నడిపించనుంది. బంగ్లాదేశ్ పర్యటనలో హద్దులు ధాటిన హర్మన్‌ప్రీత్ కౌర్‌పై ఐసీసీ రెండు మ్యాచ్‌లు నిషేధం విధించింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌ల్లో మంధాన, కెప్టెన్‌గా వ్యవహరించబోతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications