For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సినిమాల్లోకి రోహిత్ శర్మ..?

టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సినీ రంగంలోకి అరంగేట్రం చేయనున్నాడా? నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హిట్ మ్యాన్ షేర్ చేసిన స్టోరీ ఈ వార్తలకు బలం చేకూర్చుతుంది.

ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ రూపొందించే డాక్యుమెంటరీ లేదా సినిమాలో రోహిత్ నటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. రోహిత్ శర్మ షేర్ చేసిన ఫొటోలో నెట్‌ఫ్లిక్స్ లెటర్ హెడ్‌పై ముంబై ఇండియన్స్ లోగోతో ఉంది. ఈ లెటర్ హెడ్‌పై టైటిల్ అనే దగ్గర ముందు పదాన్ని కొట్టివేయగా, చివర్లో ఛాంపియన్ అని కనిపిస్తోంది. అలాగే రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45, అతని పేరు, ఏప్రిల్ 9, 2026 అనే డేట్ రాసి ఉంది. ఈ ఇన్‌స్టా స్టోరీకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కాపీ అనే క్యాప్షన్ ఇచ్చాడు.

కోహ్లీ, ధోనీ కాదు.. అక్కడ రోహిత్ శర్మ! మాములుగా ఉండదు!(వీడియో)కోహ్లీ, ధోనీ కాదు.. అక్కడ రోహిత్ శర్మ! మాములుగా ఉండదు!(వీడియో)

టైటిల్ పాక్షికంగా దాగి ఉండటంతో.. రోహిత్ క్రికెట్ ప్రయాణంపై డాక్యుమెంటరీ లేదా బయోగ్రఫీపై ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ రోహిత్ శర్మ జీవిత ప్రయాణానికి సంబంధించి డాక్యూమెంటరీని నెట్‌ఫ్లిక్స్ రూపొందిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే తన జీవిత కథపై తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్‌లో రోహిత్ శర్మనే నటిస్తాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Is Rohit Sharma Making His Netflix Debut Hitman Sparks Excitement With Mysterious Next Innings Teaser

నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభమైన కపిల్ శర్మ కొత్త టాక్ షోకు రోహిత్ శర్మ తొలి గెస్ట్‌గా వచ్చారని, ఆ షోను ప్రమోట్ చేయడానికే నెట్‌ఫ్లిక్స్ ఈ వినూత్నమైన మార్కెటింగ్ ప్లాన్‌ను అమలు చేసిందనే వాదన కూడా వినిపిస్తోంది. రోహిత్ పోస్ట్‌కు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కూడా చాలా ఆసక్తికరంగా స్పందించింది. 'హిట్‌మ్యాన్ వస్తున్నాడు, ఫీల్డింగ్ సెట్ చేసుకోండి’ అనే క్యాప్షన్‌గా పేర్కొంది.

Is Rohit Sharma Making His Netflix Debut Hitman Sparks Excitement With Mysterious Next Innings Teaser
Photo Credit: rohit sharma Instagram

ఐపీఎల్ 2026 సీజన్‌ను రోహిత్ శర్మ ఘనంగా ప్రారంభించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ 38 బంతుల్లో 78 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో 35 పరుగులతో రాణించిన రోహిత్.. రాజస్థాన్ రాయల్స్‌తో 5 పరుగులకే ఔటై తీవ్రంగా నిరాశపర్చాడు. మూడు మ్యాచ్‌ల్లో 118 పరుగులు చేశాడు.

DC vs MI: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ!(వీడియో)DC vs MI: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ!(వీడియో)

Story first published: Thursday, April 9, 2026, 17:04 [IST]
Other articles published on Apr 9, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+