Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ధోనీ!

చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) హెడ్ కోచ్ బాధ్యతల నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ తప్పుకోవడంతో తదుపరి కోచ్ ఎవరా? అనే చర్చ జోరందుకుంది. సుదీర్ఘ కాలం చెన్నైకి సేవలందించిన ఫ్లెమింగ్ పరస్పర అంగీకారంతో ఫ్రాంచైజీకి వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2009 సీజన్‌కు ముందు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫ్లేమింగ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆ పదవిలో కొనసాగాడు.

IND vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు! (వీడియో)

IND vs ENG: కన్నీళ్లు పెట్టుకున్న బుడ్డోడు! (వీడియో)

ఫ్లెమింగ్ తప్పుకోవడంతో మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హెమాంగ్ బదోనిలు సీఎస్‌కే తదుపరి హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకైతే సీఎస్‌కే ఫ్రాంచైజీ తమ తదుపరి కోచ్ ఎవరా? అనే విషయాన్ని ప్రకటించలేదు.

Is MS Dhoni Set to Take Over as CSK Head Coach Role Ahead of IPL 2027 Mega Auction After Stephen Fleming s departure

కోచ్‌గా ధోనీ..?

చెన్నై సూపర్ కింగ్స్‌తో ధోనీకి విడదీయలేని అనుబంధం ఉంది. ధోనీ సారథ్యంలోనే సీఎస్‌కే ఐదు టైటిళ్లు గెలిచింది. ఫ్లెమింగ్, ధోనీ కలిసి దాదాపు రెండు దశాబ్దాల పాటు సీఎస్‌కేకు సేవలందించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్‌గా ధోనీకి గుర్తింపు ఉంది. మైదానంలో అతను తీసుకునే నిర్ణయాలు ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

ప్రస్తుతం పునర్నిర్మాణ దశలో ఉన్న సీఎస్‌కేకు ధోనీ కోచ్‌గా వస్తే జట్టుకు మేలు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ధోనీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాడా? లేదా? అనే విషయంపై ఫ్రాంచైజీ నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. కానీ అభిమానులు మాత్రం ధోనీనే తదుపరి కోచ్ అంటూ ప్రచారం చేస్తున్నారు.

రాహుల్ ద్రవిడ్..

టీమిండియా, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా అపార అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్.. స్టీఫెన్ ఫ్లెమింగ్ వారసుడిగా సీఎస్‌కే హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు సరైన వాడు. వరల్డ్ బెస్ట్ కోచ్‌ల్లో రాహుల్ ద్రవిడ్ ఒకరు. భారత అండర్ 19, ఏ టీమ్ కోచ్‌లుగా వ్యవహరించి.. సీనియర్ టీమ్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. తన హయాంలోనే టీమిండియాకు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 అందించాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కూడా కోచ్‌గా పనిచేశాడు.

అతని ప్రశాంతమైన నాయకత్వ శైలి, ఆటగాళ్ల అభివృద్దిపై అతను పెట్టే శ్రద్ద, డ్రెస్సింగ్ రూమ్‌ను నడిపించే సామర్థ్యం.. ప్లెమింగ్‌కు దగ్గరగా ఉంటాయి. దాంతో అతని స్థానాన్ని భర్తీ చేయడానికి ద్రవిడ్ సరిగ్గా సరిపోతాడు.అయితే ఈ బాధ్యతలను స్వీకరించేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా ఉన్నాడా? లేదా? అనే విషయంపై ఎలాంటి స్పష్టమైన సమాచారం లేదు. సీఎస్‌కే అతన్ని అప్రోచ్ అయినట్లు కూడా ఆధారాల్లేవ్.

IND vs ENG: బరిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

IND vs ENG: బరిలో కోహ్లీ, రోహిత్, బుమ్రా.. ఇంగ్లండ్‌తో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

హెమాంగ్ బదోని

ఓవైపు ధోనీ, ద్రవిడ్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మాత్రం హెమాంగ్ బదోనితో చర్చలు జరుపుతున్నట్లు ఓ వెబ్‌సైట్ పేర్కొంది. గత సీజన్‌లో బదోని ఢిల్లీ క్యాపిటల్స్‌ను నడిపించాడు. బదోని వ్యూహాత్మక ఆలోచనకు సీఎస్‌కే ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు సీఎస్‌కే సీనియర్ మేనేజ్‌మెంట్ ఫ్రాంచైజీ క్రికెట్ ఆపరేషన్స్‌పై సమీక్ష నిర్వహించనున్నట్లు కూడా సదరు వెబ్‌సైట్ పేర్కొంది.

మహేంద్ర సింగ్ ధోనీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉంటే ఫ్రాంచైజీ మరో ఆలోచన లేకుండా నియమిస్తోంది. ఎందుకంటే ఆ ఫ్రాంచైజీ అభిమానులతో ధోనీ అంతలా కనెక్ట్ ఉంది. ధోనీ కారణంగానే ఆ ఫ్రాంచైజీకి ఇంకా క్రేజ్ ఉంది.

Story first published: Monday, July 13, 2026, 16:20 [IST]
Other articles published on Jul 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+