Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దీపిక కోసం హెయిర్‌స్టైల్ మార్చిన ధోనీ!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. నేడు(జూలై 7న) 42వ జన్మదినం జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ధోనీకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, మాజీ క్రికెటర్లు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. ఆయురారోగ్యాలతో ధోనీ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. అతని అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు.

తమకు నచ్చిన రీతిలో ధోనీకి విషెస్ తెలియజేస్తున్నారు. ధోనీలో నచ్చే విషయాన్ని, అతని రికార్డులను, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుంటున్నారు. ఇక కొందరైతే ధోనీ హెయిర్ స్టైల్ తమకు చాలా ఇష్టమని పేర్కొంటున్నారు. అయితే కెరీర్‌ ప్రారంభంలో జుంపాల జట్టుతో ఉన్న ధోనీ హెయిర్‌ స్టైల్‌కు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.

 MS Dhoni Long Hair:

అప్పట్లో ధోనీ హెయిర్ స్టైల్‌ను చాలా మంది అనుకరించారు. విశాఖ వేదికగా పాకిస్థాన్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మహీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాంతో అతని హెయిర్ స్టైల్‌కు కూడా క్రేజ్ వచ్చింది. ధోనీ హెయిర్ స్టైల్‌కు పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కూడా ఫిదా అయ్యాడు. ధోనీ హెయిర్‌స్టైల్‌ను అమితంగా ప్రేమించిన ముషారఫ్‌ జుట్టు కట్‌ చేయించుకోవద్దని రిక్వెస్ట్‌ చేయడం కూడా అప్పట్లో బాగా వైరల్‌ అయింది.

2006లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోని భారత జట్టు.. ఐదు వన్డేల సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. లాహోర్ వేదికగా జరిగిన మూడో వన్డేను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అప్పటి పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ రాగా.. ఆ మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసిన ధోనీ.. చేజింగ్‌లో భారత్ జట్టును గెలిపించాడు.

మ్యాచ్‌ను ధోనీ ముగించిన తీరుకి ముచ్చటపడిన ముషారఫ్.. ధోనీ గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. ముఖ్యంగా అతని హెయిర్‌ స్టైల్‌ తనకు బాగా నచ్చిందని ప్రశంసించాడు. 'ధోనీ నువ్వు ఈ హెయిర్ కట్‌లో చాలా బాగున్నావు. ఒకవేళ నువ్వు నా ఒపీనియన్ తీసుకుంటే.. హెయిర్ స్టైల్ మార్చకు'అని రిక్వెస్ట్ చేశాడు.

ఆ తర్వాత కూడా అదే హెయిర్ స్టైల్‌ను కొనసాగించిన ధోనీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ విజయానంతరం జుంపాల జుట్టును కత్తరించి అందరికీ షాకిచ్చాడు. యావత్ ప్రపంచం మెచ్చిన హెయిర్ స్టైల్‌ను ధోనీ ఎందుకు వదులుకున్నాడనేది ఇప్పటికీ సస్పెన్స్. అయితే దీనిపై రకరకాల ఉహాగానాలు తెరపైకి వచ్చాయి.

 MS Dhoni Long Hair:

ఆ టైమ్‌లో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునేతో ధోనీ పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వెలువడ్డాయి. దీపికా కోసమే ధోనీ హెయిర్ స్టైల్ మార్చుకున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ... ఆ సమయంలో దీపికా పదుకొనే, మాహీని లాంగ్ హెయిర్ లేకుండా చూడాలని కోరిందట. ఆమె కోరికను మన్నించిన మాహీ, వెంటనే హెయిర్ స్టైల్ మార్చేశాడని అంతా అనుకుంటున్నారు.

Story first published: Friday, July 7, 2023, 14:38 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+