Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బిగ్‌బాస్ బ్యూటీతో మహమ్మద్ సిరాజ్‌ ప్రేమాయణం!

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌ లవ్‌లో పడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిగ్ బాస్ 13 ఫేమ్ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోయినా.. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. ఫొటోలను లైక్స్ కొట్టడం వంటివి చేస్తున్నారు.

దాంతోనే ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో సినీ తారాలతో ప్రేమాయణం నడిపిన క్రికెటర్లు కూడా ఇలానే ముందుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ.. పోస్ట్‌లకు లైక్స్ కొట్టుకున్నవారే కావడంతో.. సిరాజ్-మహిరా శర్మ లవ్ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Is Mohammed Siraj dating With Bigg Boss 13 fame Mahira Sharma

క్రికెటర్లు సినీ తారలతో ప్రేమాయణం నడపడం కొత్త కాదు. మన్సూరు అలీ ఖాన్ పటౌడీ నుంచి కేఎల్ రాహుల్ వరకు ఎన్నో జంటలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వస్తే మరికొన్ని డేటింగ్ వరకే పరిమితమయ్యాయి. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, కేఎల్ రాహుల్-అతియా శెట్టిలు కూడా సీక్రెట్‌గా లవ్ చేసుకొని పెళ్లి పీటలు ఎక్కారు.

ఇప్పుడు సిరాజ్ కూడా వీరి బాటలోనే నడుస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మహిరా శర్మ తరచూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇటీవల కూడా ఈ బిగ్ బాస్ 13 స్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో ఆమె దేసీ ఔట్ ఫిట్ లో బ్యాక్ లెస్ టాప్ వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ ఫొటోలను సిరాజ్ లైక్ చేయడంతోనే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం ఊపందుకుంది. మహిరా శర్మ ఫొటోలను సిరాజ్ లైక్ చేసిన స్క్రీన్ షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సిరాజ్ దుమ్మురేపాడు. తొలి ఇన్నింగ్స్‌లో రెండు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఫస్ట్ టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌లో డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ పింక్ బా‌ల్‌తో డే/నైట్ జరగనుంది.

Story first published: Tuesday, November 26, 2024, 21:54 [IST]
Other articles published on Nov 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+