Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ వల్లే అశ్విన్ రిటైర్మెంట్..?

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. సిరీస్ మధ్యలోనే అశ్విన్ ఇలా రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా అనేక సందేహాలకు దారి తీసింది. అసలు ఇంత సడెన్‌గా అశ్విన్ రిటైర్మెంట్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది.

Is Gautam Gambhir Reason Behind Ravichandran Ashwin s retirement

గంభీర్ రాకతోనే..
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టడంతోనే అశ్విన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకొచ్చి గంభీర్.. అశ్విన్‌కు చెక్ పెట్టాడని, మిగిలిన సీనియర్ ఆటగాళ్లు కూడా అశ్విన్ బాటలో నడిచే సమయం ఎంతో దూరంలో లేదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో అశ్విన్ తడబడగా.. గంభీర్ సడన్‌గా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకొచ్చాడు. అతను వచ్చిన అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్‌కు బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉండటంతో అశ్విన్‌ వెనకబడిపోయాడు.

వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో..
పెర్త్ టెస్ట్ వేదికగా అశ్విన్, జడేజాలను కాదని సుందర్‌కు అవకాశం ఇచ్చారు. తద్వారా అశ్విన్‌ స్థానాన్ని సుందర్ భర్తీ చేయగలడనే సంకేతాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చింది. పింక్ బాల్‌ టెస్ట్‌లో అశ్విన్‌కు అవకాశం కల్పించినా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మూడో టెస్ట్‌లో అతని స్థానంలో వచ్చిన జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు ఓటమి తప్పించాడు.

ఈ ప్రదర్శనతో చివరి రెండు టెస్ట్‌ల్లో జడేజాను పక్కనపెట్టలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఇప్పట్లో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు లేవు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే డబ్ల్యూటీసీ 2023-2025లో భారత మ్యాచ్‌లు ముగుస్తాయి. వచ్చే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌.. ఇంగ్లండ్ పర్యటనతో ప్రారంభం కానుంది. అప్పటి వరకు భారత జట్టుకు దూరంగా ఉండి మళ్లీ ఎంపికవ్వలేని పరిస్థితి తెచ్చుకోవడం కంటే జట్టులో ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని అశ్విన్ భావించినట్లు అర్థమవుతోంది.

Story first published: Wednesday, December 18, 2024, 18:38 [IST]
Other articles published on Dec 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+