శుభ్‌మన్ గిల్ ఔట్.. పృథ్వీ షా, పడిక్కల్ కోసం కోహ్లీ సేన రిక్వెస్ట్.. పట్టించుకోని సెలెక్టర్లు!

న్యూఢిల్లీ: చేతన్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ సెలెక్షన్ కమిటీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసిన జట్టే ఇందుకు కారణంగా తెలుస్తోంది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎడమ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమవ్వడంతో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌మేనేజ్‌మెంట్ యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపించాలని కోరిందంట. అయితే ఈ రిక్వెస్ట్‌ను భారత సెలెక్షన్ కమిటీ పట్టించుకోలేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
అయితే ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్‌ను కాదని బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఇంగ్లండ్ పర్యటనకు పంపించడం కూడా చర్చనీయాంశమైంది. 2019-20 రంజీ సీజన్, ఇండియా ఏ న్యూజిలాండ్ పర్యటనలో ఏ మాత్రం ప్రభావం చూపని అభిమన్యు ఈశ్వరన్‌ను ఏ ప్రాతిపాదికన ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.

పడిక్కల్, పృథ్వీ కోసం..
అంతేకాకుండా ఇంగ్లండ్‌లో ఆడే సత్తా, టెక్నిక్ ఈశ్వరన్‌కు లేదని భావించిన టీమ్‌మేనేజ్‌మెంట్ పృథ్వీ షా, పడిక్కల్‌ను యూకేకు పంపించాలని సెలెక్షన్ కమిటీకి మెయిల్ చేసినట్లు బోర్డుకు చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.'శుభ్‌మన్ గిల్ పిక్క కండరాల గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతను కోలుకోవడానికి సుమారు మూడు నెలల సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గత నెల చివర్లో సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మకు మరో ఇద్దరు ఓపెనర్లను ఇంగ్లండ్ పంపించాలని కోరుతూ మెయిల్ చేశాడు.'అని సదరు అధికారి తెలిపాడు.

బీసీసీఐ బాస్ జోక్యం చేసుకుంటేనే..
అయితే శుభ్‌మన్ గిల్ గాయం తీవ్రత గురించి తెలిసినా.. టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి మెయిల్ వచ్చినా చేతన్ శర్మ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా జోక్యం చేసుకుంటేనే చేతన్ శర్మ స్పందించేలా ఉన్నాడని సదరు అధికారి అభిప్రాయపడ్డాడు. 'ప్రస్తుతానికైతే పృథ్వీషా, పడిక్కల్‌ను పంపించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి సౌరవ్ గంగూలీ, జైషాకు ఎలాంటి అధికారిక రిక్వెస్ట్ రాలేదు. ప్రస్తుతం షా, పడిక్కల్ పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శ్రీలంకలో ఉన్నారు. జూలై 26 తర్వాత వారిద్దరూ ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం డర్హమ్‌లోని బయో బబుల్‌లోకి ప్రవేశించే ముందే వారు అక్కడికి రావాలనుకుంటుంది.'అని ఆ అధికారి చెప్పుకొచ్చాడు.

ఈశ్వరన్‌కు ఎలా చోటు..?
పృథ్వీషాను కాదని ఈశ్వరన్‌ను స్టాండ్‌బైగా ఎలా ఎంపిక చేశారో అర్థం కావడం లేదని మాజీ సెలెక్టర్ ఒకరు తెలిపారు. 'క్వాలిటీ, టాలెంట్ విషయంలో పృథ్వీ, ఈశ్వరన్‌కు అసలు పోలికే లేదు. ఈశ్వరన్ కంటే పృథ్వీ చాలా మెరుగ్గా ఉన్నాడు. అంతేకాకుండా షా ఇప్పటికే సెంచరీ చేశాడనే విషయం మరవద్దు. అంతేకాకుండా ప్రస్తుతం అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని శ్రీలంక టూర్‌కు కాకుండా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాల్సింది. అయితే షా వైట్ బాల్ క్రికెట్‌లో రాణించాడని, అందుకే అతన్ని టెస్ట్‌లకు పరిగణించలేదనే వాదన తెరపైకి రావచ్చు.
అప్పుడు పృథ్వీషాకు అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు ఇంగ్లండ్‌కు పంపిస్తే మాత్రం ఈశ్వరన్‌ది తప్పుడు సెలెక్షన్ అన్నట్లే. అంతేకాకుండా ఆ యువ ఆటగాడి ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతోంది. దేవదత్‌కు ఇప్పుడు అవకాశం రాకపోయినా.. అతి తక్కువ కాలంలో అతను ఆల్ ఫార్మాట్ స్టార్‌గా ఎదుగుతాడు.'అని ఆ మాజీ సెలెక్టర్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications