Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ష్‌దీప్ సింగ్ మూములోడు కాదు.. మిస్ ఇండియానే పటాయించాడు!

టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. పంజాబ్‌ నటి సమ్రీన్ కౌర్‌తో ప్రేమయాణం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ష్‌దీ సింగ్ ఇటీవల తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకొని ఉన్న ఫొటో షేర్ చేశాడు. ఆ ఫొటోలోని అమ్మాయి చేతిపై ఒక స్పెషల్ టాటూ ఉంది. అయితే ఆ టాటు పంజాబ్‌ మోడల్, నటి సమ్రీన్ కౌర్‌దేనని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఈ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇటీవల ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌కు సమ్రీన్ కౌర్ హాజరైంది. పంజాబ్ కింగ్స్ జెర్సీతో స్టేడియంలో సందడి చేసింది. ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అయితే అర్ష్‌దీప్ సింగ్, సమ్రీన్ కౌర్ ప్రేమలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాకుండా ఖండిచనూ లేదు. దాంతో ఈ వార్తలు నిజమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అర్ష్‌దీప్ సింగ్ మాములోడు కాదని, హీరోయిన్‌నే పటాయించాడని సెటైర్లు పేల్చుతున్నారు.

Is Arshdeep Singh Dating Samreen Kaur Rumors Swirl Around PBKS Bowler and Punjabi Actress

ఎవరీ సమ్రీన్ కౌర్..?

సమ్రీన్ కౌర్.. పంజాబీ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. ముందుగా తన మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె.. ఆ తర్వాత పలు సినిమాలతో అలరించింది. ఆమె అందం, నటన అభిమానులను ఆకట్టుకుంది. దాంతో పంజాబ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

బాలీవుడ్‌లోనూ ఆమె పలు చిత్రాల్లో నటించింది. 1983 వన్డే ప్రపంచకప్ విజయం నేపథ్యంలో తెరకెక్కిన 83 సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను రణవీర్ సింగ్ పోషించిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల సమ్రీన్ పూణేలోని సింబయాసిస్ కాలేజీలో చదవుకుంది. ప్రస్తుతం మోడల్, నటిగా రాణిస్తున్న ఆమె 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. అనేక పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో నటించిన ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

అర్ష్‌దీప్ సింగ్ తడబాటు..

ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్ష్‌దీప్ సింగ్.. టీ20 ప్రపంచకప్ 2026 జోరును కొనసాగించలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గుజరాత్‌తో(0/42) చెన్నైతో (0/41), కేకేఆర్(0/16)తో మ్యాచ్‌ల్లో ధారళంగా పరుగులిచ్చుకున్నాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో పంజాబ్ రెండు విజయాలు సాధించగా.. కేకేఆర్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.

Story first published: Tuesday, April 7, 2026, 18:23 [IST]
Other articles published on Apr 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+