Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాజకీయాల్లోకి అంబటి రాయుడు..!

Is Ambati Rayudu joins politics? Here’s what he says

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు తేజం అంబటి రాయుడు(Ambati Rayudu) రాజకీయాల్లోకి రానున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్య బీఆర్‌ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్న రాయుడు.. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాడు. ముఖ్యంగా తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో సన్నిహితంగా ఉంటున్నాడు. రాయుడి ద్వారా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)ను చక్కదిద్దేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ప్రజలకు సేవ చేయగలిగే అవకాశం లభిస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటానని తాజాగా అంబటి రాయుడు వెల్లడించాడు.

నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అంబటి రాయుడు కేవలం ఐపీఎల్‌‌లోనే కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కెరీర్‌లో చివరి సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు. ఈ సీజన్ అనంతరం పూర్తిగా ఆటకు వీడ్కోలు పలకాలని రాయుడి నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చాలామంది క్రీడాకారులు కెరీర్‌ ముగిశాక రాజకీయాల్లోకి వస్తున్నారని, మీకు అలాంటి ఆలోచన ఉందా?అని ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తూ.. తన మనసులోని కోరికను వెల్లడించాడు.

ప్రజలకు ఎక్కువ సేవ చేయగలిగే అవకాశం ఉంటుందంటే రాజకీయాల్లోకి రావడంపై తప్పకుండా పరిశీలిస్తానని చెప్పాడు. వీలైనంత ఎక్కువ మంది కోసం పనిచేయాలన్నదే తన లక్ష్యమని చెప్పిన రాయుడు.. పూర్తి నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తానని వెల్లడించాడు. నిజాయతీగా సేవలు అందిస్తానని, యువతకు స్ఫూర్తిగా నిలుస్తానని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2023 సీజన్ కోసం అన్ని విధాల సిద్దమయ్యానని రాయుడు తెలిపాడు. రెండు నెలల క్రితమే ఫిట్‌నెస్‌, ట్రెయినింగ్‌ మొదలైందని, ఈనెల మూడో తేదీన చెన్నైలో శిక్షణ శిబిరంలో పాల్గొన్నానని తెలిపాడు. కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోనీతో సహా జట్టంతా ఈ ప్రాక్టీస్ క్యాంప్‌లో చెమటోడుస్తుందన్నాడు. ప్రతీ రోజూ అత్యంత తీవ్రతతో ప్రాక్టీస్‌, ట్రెయినింగ్‌ సెషన్‌లు జరిగాయని, ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని తెలిపాడు. బ్యాటింగ్‌లో మంచి లయ కనిపిస్తోందన్న రాయుడు.. పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

2010 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్న అంబటి రాయుడు మొదట ముంబై ఇండియన్స్‌ (2013, 2015, 2017).. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ (2018, 2021) తరఫున ఐదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. లీగ్‌లోనే అత్యధిక టైటిళ్లు గెలిచిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ(6) అగ్రస్థానంలో ఉన్నాడు.

Story first published: Wednesday, March 29, 2023, 8:30 [IST]
Other articles published on Mar 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+