ఇర్ఫాన్ పఠాన్ సతీమణి ఫొటో వైరల్.. ఇదేం పద్దతంటూ నెటిజన్లు ఫైర్.. దిమ్మతిరిగే బదులిచ్చిన మాజీ ఆల్‌రౌండర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి ట్రోలింగ్‌కు గురయ్యాడు. అతని ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. అందులో అతని సతీమణి ముఖం బ్లర్ చేసి ఉంది. దాంతో నెటిజన్లు పఠాన్‌ను తప్పుబట్టారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినా.. ఇంకా భార్యను కట్టుబాట్లలోనే ఉంచుతున్నాడని విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియా వేదికగా మానవత్వం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పఠాన్ తన భార్యకే స్వేచ్చనివ్వడం లేదని మండిపడ్డారు.
అసలేం జరిగిందంటే...
కరోనాతో గతేడాది వాయిదా పడిన దిగ్గజ క్రికెటర్ల రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఇటీవల రాయ్‌పూర్ వేదికగా పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్.. టోర్నీ సందర్భంగా సతీమణి సఫా బైగ్, కొడుకుతో కలిసి ఫొటో దిగాడు. అయితే ఈ ఫొటో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఇర్ఫాన్ కొడుకును ఎత్తుకొని ఉండగా.. పక్కన భార్య సఫా బేగ్ నిలబడి ఉన్నది. ఆమె ముఖం మాత్రం బ్లర్ చేసి ఉండటంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు.

ప్రతీ ఫొటోలోనూ..
ఈ ఫొటోనే కాకుండా పఠాన్ సతీమణికి సంబంధించిన ప్రతీ ఫొటోలో సఫా బేగ్ తన ముఖాన్ని మాత్రం కనిపించకుండా జాగ్రత్త పడుతుంది. ఒక్కోసారి చేతులతో మొఖాన్ని కవర్ చేసుకుంటుంది. ఇర్ఫాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో భార్యతో దిగిన ఫొటోలు చాలా ఉన్నాయి. కానీ దేంట్లోనూ ఆమె ముఖం స్పష్టంగా మాత్రం కనిపించదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఇర్ఫాన్‌పఠాన్‌పై ట్రోలింగ్‌కు దిగారు.

గట్టిగా బదులిచ్చిన పఠాన్..
తనను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్న నెటిజన్లకు పఠాన్ గట్టిగా కౌంటరిచ్చాడు. తన భార్యకు తాను భర్తను మాత్రమేనని.. మాస్టర్‌ను కాదని బదులిచ్చాడు. 'ఈ ఫొటోను నా కొడుకు అకౌంట్ ద్వారా నా సతీమణి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు చాలా వ్యతిరేకత వస్తోంది. ఆమె ఉద్దేశపూర్వకంగానే తన ముఖాన్ని బ్లర్ చేసుకుంది. నేను తన భర్తను, మాస్టర్‌ను కాదు" అంటూ బదులిచ్చాడు. ఆమె ఫొటో కనిపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ సఫా బేగ్ ఇష్టం లేదనే విషయాన్ని పఠాన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications