
రాణించడానికి సిద్ధంగా ఉంటాడు:
తాజాగా ఇర్ఫాన్ పఠాన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'టీమిండియా తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్ల పట్ల జట్టు యాజమాన్యం సరైన పద్ధతిలో వ్యవహరిస్తోందని నేను ఆశిస్తున్నా. వారిని మానసికంగా దృఢంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అందుకే ఇటీవల యువకులు బాగా రాణించిన సందర్భాలను మనం చూశాం. అలాగే కుల్దీప్ విషయంలోనూ జట్టు అండగా ఉందని అనుకుంటున్నా. అతడికిప్పుడు 25-26 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులోనే పరిణతి చెందుతాడు. రాబోయే సిరీస్‌లో ఎప్పుడు అవకాశం వచ్చినా రాణించడానికి సిద్ధంగా ఉంటాడు' అని అన్నాడు.

అంత తేలిగ్గా దొరకడు:
'కుల్దీప్ యాదవ్ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు ఏ జట్టుకైనా అంత తేలిగ్గా దొరకడు. రాబోయే టెస్టు సిరీస్‌లో అతడికి కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరుతున్నా. ఎందుకంటే ఇంగ్లాండ్ గత ప్రదర్శనలు ఓసారి చూస్తే.. ఆ జట్టు లెగ్ స్పిన్నర్లపై అంతగా ఆడలేదు. కుల్‌దీప్ ఈ సిరీస్‌లో ఆడితే కచ్చితంగా మంచి ప్రదర్శన చేస్తాడు. ఆ నమ్మకం ఉంది' అని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కుల్దీప్ ఇప్పటివరకు 6 టెస్టులు, 61 వన్డేలు, 45 టీ20లు ఆడాడు. మొత్తగా 168 వికెట్లు పడగొట్టాడు.

ముగ్గురు స్పిన్నర్లు అవసరం:
భారత జట్టు ఎలాంటి కాంబినేషన్‌లోనైనా ఆడగలదని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. చెన్నై పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే పరిస్థితుల్లో ముగ్గుర్ని కూడా ఆడించొచ్చని పేర్కొన్నాడు. సహజంగా భారత జట్టు ముగ్గురు పేసర్లతో ఏ వికెట్ మీదైనా ఆడుతుందని అన్నాడు. అయితే చెన్నై పిచ్‌ను పరిశీలిస్తే ముగ్గురు స్పిన్నర్లు అవసరమని మాజీ పేసర్ చెప్పాడు. భారత్-ఇంగ్లాండ్ ఆటగాళ్లు సోమవారమే తమ క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. అందరికీ మూడోసారి నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా తేలడంతో మంగళవారం ప్రాక్టీస్ చేశారు. శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఇంతకన్నా సుందరమైన క్రికెట్ స్టేడియాల్ని చూపిస్తారా?.. ఐసీసీ ఛాలెంజ్!!


Click it and Unblock the Notifications












