Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆకిబ్ నబీ ఏం పాపం చేశాడు.. రంజీ హీరోకు అవకాశం ఇవ్వరా?: ఇర్ఫాన్ పఠాన్

అజిత్ అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టులో జమ్మూ కశ్మీర్ పేస్ సెన్సేషన్, రంజీ హీరో ఆకిబ్ నబీకి అవకాశం ఇవ్వకపోవడాన్ని ఇర్ఫాన్ తప్పుబట్టాడు. అతను ఏం పాపం చేశాడని నిలదీసాడు. ఫాస్ట్ బౌలర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉండేదే ఐదేళ్లు అని చురకలంటించాడు.

ఇటీవలే శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టులో 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు అవకాశం దక్కింది. బుమ్రా, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేసర్లుగా ఎంపికయ్యారు.

Auqib Nabi: రంజీ కింగ్‌కు ఘోర అవమానం.. 60 వికెట్లు తీసినా..!

Auqib Nabi: రంజీ కింగ్‌కు ఘోర అవమానం.. 60 వికెట్లు తీసినా..!

60 వికెట్లు తీసినా..

భారత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26ని జమ్మూ కశ్మీర్ కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో జమ్మూ ప్రధాన పేసర్ ఆకిబ్ నబీ ఏకంగా 10 మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ఒక్క సీజన్‌లోనే 8 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. గత రెండు సీజన్లలో కలిపి మొత్తం 104 వికెట్లు పడగొట్టాడు.

Irfan Pathan slams Indian selectors over Auqib Nabi s Snub For Sri Lanka Tour Squad Says Didn t understand

ఇటీవల భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఆకిబ్ నబీ రెండు అనధికారిక టెస్ట్‌ల్లో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయినా సెలెక్టర్లు అతన్ని శ్రీలంక పర్యటనకు ఎంపిక చేయలేదు.

సెలెక్టర్ల లాజిక్ ఏంటో తెలియడం లేదు..

ఇదే విషయంపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన పఠాన్ సెలెక్టర్ల తీరును తప్పుబట్టాడు. 'ఆకిబ్ నబీని ఎంపిక చేయకపోవడానికి వెనుక ఉన్న లాజికల్ ఆన్సర్ ఏంటో తెలియడం లేదు. సెలెక్షన్ తీరు కూడా నాకు అర్థం కావడం లేదు. జస్‌ప్రీత్ బుమ్రా లేని సమయంలో మహమ్మద్ సిరాజ్‌ భారత ప్రధాన పేసర్. నెంబర్ వన్ బౌలర్.

భారత్ గెలవాలంటే.. ఆ ఆర్‌సీబీ హీరోను జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

Also Read

భారత్ గెలవాలంటే.. ఆ ఆర్‌సీబీ హీరోను జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగం కాని అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో కూడా సిరాజ్‌ను ఆడించాల్సిన అవసరం ఏంటి? దేశవాళీ క్రికెట్‌లో బాగా ఆడేవారికి అవకాశం ఇస్తారనేది నిజమైతే..ఆ మ్యాచ్‌లో ఆకిబ్ నబీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు?

ఫామ్‌లో ఉండేదే ఐదేళ్లు..

ఫాస్ట్ బౌలర్లు సాధారణంగా 27 నుంచి 32 ఏళ్ల మధ్య వయసులో అత్యుత్తమంగా రాణిస్తారు. ఆ కీలకమైన సమయంలో మనం వారికి సరైన అవకాశాలు ఇవ్వకపోతే.. వారి ప్రతిభను సద్వినియోగం చేసుకోలేం. దేశీయ మ్యాచ్‌ల్లో బాగా రాణించిన సరాన్ష్ జైన్ వంటి ఆటగాళ్లను ఎంపిక చేయడం ప్రశంసనీయం. కానీ అదే రూల్‌ను ఆకిబ్ నబీకి ఎందుకు వర్తింపజేయలేదు? ఫాస్ట్ బౌలర్లకు గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతన్ని బ్యాకప్ ప్లేయర్‌గా సిద్దం చేసి ఉండాల్సింది.'అని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Thursday, July 30, 2026, 10:37 [IST]
Other articles published on Jul 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+