Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మిగతా కెప్టెన్‌ల కంటే గంగూలీ స్టయిలే‌ వేరు.. టైమ్ చూసుకుని టాస్‌కి వెళ్లేవాడు'

Irfan Pathan Sheds Light On Sourav Ganguly’s Habit Of Going Late For Tosses

ఢిల్లీ: మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2000-2005 మధ్య కాలంలో భారత జాతీయ జట్టుకు నాయకత్వం వహించాడు. సాధారణంగా ఇరుజట్ల కెప్టెన్‌లు టాస్ సమయం కంటే ముందే మైదానంలోని పిచ్ వద్దకి వచ్చి వెయిట్ చేస్తుంటారు. కానీ 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ స్టయిలే‌ వేరు. గ్రౌండ్‌లో మ్యాచ్ రిఫరీతో పాటు ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ టాస్ కోసం వెయిట్ చేస్తుంటే.. దాదా మాత్రం తాపీగా టాస్‌కి వెళ్లేవాడు. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ తదితరులు అప్పట్లో గంగూలీ తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

దాదాను అసహ్యించుకునేవాడిని

దాదాను అసహ్యించుకునేవాడిని

మ్యాచ్‌ టాస్‌కి లేట్‌గా వస్తాడని అప్పట్లో సౌరవ్ గంగూలీపై ఓ అపవాదు ఉండేది. ఇదే విషయాన్ని నాజర్ హుస్సేన్ కూడా ఇటీవలే చెప్పాడు. ‘గంగూలీతో ఆడుతునప్పుడల్లా అతన్ని అసహ్యించుకునేవాడిని. ఎందుకంటే టాస్‌కు వెళ్లిన ప్రతీసారి అతను నన్ను వెయిట్ చేయించేవాడు. టైమ్ అయిపోయింది మనం టాస్ వేయాలని నేను చెప్పాల్సి వచ్చేది' అని హుస్సేన్ అన్నాడు. అయితే కెప్టెన్‌లను వెయిట్ చేయించాలనే ఉద్దేశం దాదాకు లేదని, టైమ్ చూసుకుని టాస్‌కి వెళ్లేవాడని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తాజాగా తెలిపాడు.

టైమ్ చూసుకుని టాస్‌కి వెళ్లేవాడు

టైమ్ చూసుకుని టాస్‌కి వెళ్లేవాడు

స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'అది నాకు మొదటి ఆస్ట్రేలియా పర్యటన. ఓ ఘటన ఇప్పటికి గుర్తుంది. ఆ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ వా‌ని టాస్ కోసం సౌరవ్ గంగూలీ వెయిట్ చేయించాడు. ఆరోజు నేను డ్రెస్సింగ్ రూంలోనే ఉన్నాను. దాదా అక్కడే కూర్చుని అప్పుడప్పుడు టైమ్ చూస్తున్నాడు. చివరగా జట్టు మేనేజర్ వచ్చి.. సౌరవ్ టాస్‌కి టైమ్ అయ్యింది అని చెప్పాడు. ఆ వెంటనే దాదా మైదానంలోకి వెళ్లాడు. స్టీవ్ వా‌ అప్పటికే చిరాకుతో ఉన్నాడు' అని తెలిపాడు.

ముఖంలో కంగారు కనిపించేది కాదు

ముఖంలో కంగారు కనిపించేది కాదు

'ఆ తర్వాత సిడ్నీ టెస్టులో మాత్రం టాస్ టైమ్‌ని సచిన్ టెండూల్కర్ గుర్తు చేశాడు. టాస్ టైం అవుతుందని చెప్పగానే దాదా వెంటనే మైదానంలోకి వెళ్లేవాడు. సాధారణంగా టాస్ సమయంలో లేట్ అయితే ఎవరిలోనైనా కంగారు, హడావుడి కనిపిస్తుంది. కానీ సౌరవ్ గంగూలీ మాత్రం లేట్ అయినా ఎప్పుడూ ఆ కంగారు అతని ముఖంలో కనిపించేది కాదు' అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంట్రీ చెప్పడానికి కూడా దాదా ఆలస్యంగానే వచ్చేవాడు. అంతర్జాతీయ కెరీర్‌లో దాదా 113 టెస్టుల్లో, 311 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

రివర్స్‌ స్వింగ్‌ గురించి మర్చిపోవాల్సిందే:

రివర్స్‌ స్వింగ్‌ గురించి మర్చిపోవాల్సిందే:

రివర్స్‌ స్వింగ్‌ గురించి మర్చిపోవాల్సిందే:

ప్రపంచమంతా కరోనా వైరస్‌ విస్తృతమవుతున్న వేళ రివర్స్‌ స్వింగ్‌ గురించి మర్చిపోవాల్సిందేనని‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్ల మధ్య సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఉమ్మి (సలైవా) లేకుండా సాగిన బౌలింగ్‌ శైలిపై పఠాన్‌ మాట్లాడాడు. 'ఐదో రోజు ఆటలో ఆర్చర్‌, వుడ్‌ బౌలింగ్‌ చేసిన తీరు చూస్తే అర్థమవుతుంది. మంచి ఎండ కాస్తున్న సమయంలో ఉమ్మి పూయకుండా బంతి నుంచి స్వింగ్‌ రాబట్టేందుకు వాళ్లు చాలా కష్టపడాల్సి వచ్చింది' అని పఠాన్‌ అన్నాడు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐసీసీ కొత్త నియమాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్.. భారత్‌-ఇంగ్లండ్‌ సిరీస్‌లు వాయిదా!!

Story first published: Wednesday, July 15, 2020, 16:35 [IST]
Other articles published on Jul 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+