నెం.3లో ధోనీ కంటే కోహ్లీనే బెస్ట్: ఇర్ఫాన్

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వన్డే బ్యాటింగ్ ఆర్డర్ నెం.3లో మరికొంతకాలం ఆడి ఉండింటే చాలా రికార్డులు బద్దలయ్యేవి అని మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ గత శనివారం అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో నెం.3పై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పదింస్తున్నారు. అయితే భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్.. గౌతీ వ్యాఖ్యలతో విభేదించాడు. నెం.3లో విరాట్ కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడన్నాడు.

ధోనీ కంటే కోహ్లీనే బెస్ట్:
స్టార్ స్పోర్ట్స్ షో క్రికెట్ కనెక్టెడ్‌లో తాజాగా ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'వన్డే జట్టు బ్యాటింగ్ ఆర్డర్ నెం.3లో ఎంఎస్ ధోనీకి ఆడే ఛాన్స్ ఉండేది. అయితే నెం.3లో ధోనీ కంటే.. కోహ్లీనే బెటర్ బ్యాట్స్‌మెన్ అని నా అభిప్రాయం. బ్యాటింగ్ టెక్నిక్ పరంగానూ ధోనీ కంటే కోహ్లీనే మెరుగ్గా ఉంటాడు. ఇక్కడ ధోనీని నేను కించపరచడం లేదు. అతను ఓ దిగ్గజ క్రికెటర్. టీమిండియాకు ఎంతో సేవ చేసాడు. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వారివి. నెం.3లో ఎప్పటికైనా కోహ్లీకే నా మద్దతు' అని స్పష్టం చేసాడు.

17 మ్యాచ్‌లు.. 993 పరుగులు
కెరీర్‌లో తొలి నాళ్లలో మిడిలార్డర్‌లో ఆడిన ఎంఎస్ ధోనీ.. ఆ తర్వాత నెం.3కి మారాడు. ఆ స్థానంలో 17 మ్యాచ్‌లాడిన మహీ.. 82.75 సగటుతో 993 పరుగులు చేశాడు. శ్రీలంకపై 2005లో 183 పరుగుల భారీ స్కోరు నెం.3లోనే నమోదు చేసాడు. పాకిస్థాన్‌పై విశాఖపట్నంలో 148 పరుగులు నెం.3లో వచ్చాయి. అయితే 2007లో కెప్టెన్‌గా మారిన తర్వాత ఫినిషర్ బాధ్యతని తీసుకున్నాడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా నెం.5 లేదా నెం.6లో ఆడుతూ వచ్చాడు.

నెం.3లో కోహ్లీ 9,751 పరుగులు
ఎంఎస్ ధోనీ మొత్తంగా 350 వన్డే మ్యాచ్‌ల్లో 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు, 73 అర్ధ శతకాలు ఉన్నాయి. మరోవైపు విరాట్ కోహ్లీ నెం.3లో ఇప్పటి వరకూ 187 మ్యాచ్‌లాడి.. 62.90 సగటుతో ఏకంగా 9,751 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉండటం గమనార్హం. మొత్తంగా 248 వన్డేలు ఆడి 11867 బాదాడు. ఇందులో 43 శతకాలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి.

అభిమానులు లేకుండానా?
క‌్రికెట్ మైదానంలో అభిమానులు లేకుండా క్రికెట్ ఆడటం అంటే.. అతిథులు లేకుండా వివాహం చేసుకోవడమే అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. 'అతిథులు లేకుంటే వివాహం అసంపూర్తిగా అనిపిస్తుంది. అభిమానులు లేకుంటే ఐపీఎల్ పరిస్థితి కూడా అంతే. కానీ కొన్ని కొన్ని సార్లు అతిథుల కన్నా పెళ్లి చాలా ముఖ్యం. అలాంటప్పుడే న్యాయమూర్తి సమక్షంలో దండలు మార్చుకుంటాం. వివాహం అత్యవసరమైనప్పుడు ఇలా చేస్తాం. ప్రస్తుతం క్రికెట్ పరిస్థితి కూడా ఇదే' అని పఠాన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అశ్విన్ కన్నా పెద్ద స్పిన్నర్ లేడు: మాజీ స్పిన్ దిగ్గజంx