Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలా అయితేనే కోహ్లీ 100 సెంచరీలు చేయగలడు: మాజీ క్రికెటర్

Irfan Pathan Says Virat Kohli can score 100 centuries if he plays as long as Sachin Tendulkar

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డ్‌ను అధిగమించడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అంత ఈజీ కాదని
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాకపోతే విరాట్ ఆ ఫీట్‌ను అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఇప్పటికే వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు నమోదు చేసిన విరాట్.. గత మూడేళ్లుగా అద్భుత ప్రదర్శనని కనబరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్న ఈ పరుగుల యంత్రం.. రికార్డుల రారాజుగా అందరి నుంచి కితాబులు అందుకుంటున్నాడు. దీంతో విరాట్ సచిన్ 100 సెంచరీ రికార్డు బ్రేక్ చేయడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే సచిన్ టెండూల్కర్ సాధించిన 100 శతకాల్లో.. 49 సెంచరీలు వన్డేల్లో సాధించగా.. మిగిలిన 51 శతకాలు టెస్టుల్లో నమోదుచేశాడు. విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటికే వన్డేల్లో 43 సెంచరీల మైలురాయిని అందుకుని సచిన్ రికార్డ్‌కి చేరువకాగా.. టెస్టుల్లో 27 శతకాలు నమోదు చేశాడు. దాంతో సచిన్ తరహాలో సుదీర్ఘంగా కెరీర్‌ని కోహ్లీ కొనసాగించగలిగితేనే 100 సెంచరీలు నమోదు చేయగలడని స్పోర్ట్స్ తక్ చానెల్‌లో మాట్లాడుతూ పఠాన్ చెప్పుకొచ్చాడు.

'వంద సెంచరీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. కాకపోతే అది చాలా కష్టమైన పని. వన్డేల్లో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (43) రికార్డ్‌ని బ్రేక్ చేయడం కోహ్లీకి సాధ్యమే. కానీ.. 100 సెంచరీల రికార్డ్‌ని బ్రేక్ చేయడం మాత్రం అంత సులువు కాదు. ఆ రికార్డ్ అధిగమించడం అనేది కోహ్లీ ఫిట్‌నెస్‌, కెరీర్‌ను కొనసాగించడంపైనే ఆధారపడి ఉంది. ఒకవేళ సచిన్ తరహాలో సుదీర్ఘ కెరీర్‌ని (24 ఏళ్లు) కోహ్లీ కొనసాగించగలిగితే అతను ఆ 100 సెంచరీల రికార్డ్‌ని సాధించగలడు'' అని ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు.

Story first published: Wednesday, June 3, 2020, 11:32 [IST]
Other articles published on Jun 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+