For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు నటరాజన్‌ చేయాల్సింది ఇంకెంతో ఉంది: ఇర్ఫాన్‌

Irfan Pathan says T Natarajan should aim to play for Team India for the next 5 to 7 years
#Natarajan Should Aim To Play For India For The Next 5 Or 7 Years - Irfan Pathan

ముంబై: టీమిండియా యువ పేసర్‌ తంగరసు నటరాజన్‌ సుదీర్ఘ ఫార్మాట్లో చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. భారత జట్టుకు నట్టూ కనీసం ఏడెనిమిది సంవత్సరాలు అయినా సేవలు అందించాలని సూచించాడు. నటరాజన్‌ బౌలింగ్‌ శైలి అతడికెంతో ప్రయోజనకరంగా ఉందని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేయడమే కాకుండా అంచనాలను మించి రాణించిన తమిళనాడు పేసర్‌ నటరాజన్‌కు అతని స్వస్థలం చిన్నప్పంపట్టిలో అభిమానులు నీరాజనాలు పలికిన విషయం తెలిసిందే.

చేయాల్సింది ఇంకెంతో ఉంది

చేయాల్సింది ఇంకెంతో ఉంది

తాజాగా ఇర్ఫాన్‌ పఠాన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'నెట్‌ బౌలర్‌గా ఆసీస్ వెళ్లిన టీ నటరాజన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. అన్ని ఫార్మాట్లలో రాణించాడు. అయితే టెస్టుల్లో నటరాజన్‌ చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. లయ, యాంగిల్‌పై అతడు మరింత కష్టపడాలి. నిజానికి అతడి బౌలింగ్‌ శైలే అతడి అదృష్టం. అయితే బంతి విడిచే తర్వాత దేహాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు బంతి బ్యాట్స్‌మెన్‌ మీదకు వెళ్తుంది' అని సలహా ఇచ్చాడు.

5-7 ఏళ్లు ఆడేలా చూసుకోవాలి

5-7 ఏళ్లు ఆడేలా చూసుకోవాలి

'దేశానికి కనీసం 5-7 ఏళ్లు ఆడేలా తొలుత టీ నటరాజన్ లక్ష్యం నిర్దేశించుకోవాలి. అందుకోసం ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ పెట్టాలి. తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలను పూర్తిగా ఉపయోగించాలి. ఆడుతున్నప్పుడు మరిన్ని అస్త్రాలు నేర్చుకోవాలి. అతడు మరింత మెరుగయ్యేందుకు జట్టు యాజమాన్యం కచ్చితంగా కృషి చేస్తుందనే అనుకుంటున్నా. నటరాజన్ కూడా జట్టు యాజమాన్యం నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెడుతూ ఉండాలి' అని మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

బ్యాట్స్‌మన్‌ను కంగారు పెట్టాడు

బ్యాట్స్‌మన్‌ను కంగారు పెట్టాడు

తమిళనాడు యువ పేసర్‌ టీ నటరాజన్‌ సుదీర్ఘ ఆస్ట్రేలియా సిరీసులో చరిత్ర సృష్టించాడు. నెట్‌ బౌలర్‌గా ఆసీస్‌ చేరుకొని.. వన్డే, టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. చక్కని ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పదునైన యార్కర్లు, లెంగ్త్‌ బంతులతో కంగారూ బ్యాట్స్‌మన్‌ను కంగారు పెట్టాడు. అంతకుముందు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్)‌లో నట్టూ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఫిబ్రవరి 5 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకోని క్వారంటైన్‌లో ఉన్నారు.

మూడు ఫార్మాట్లలో అరంగేట్రం

మూడు ఫార్మాట్లలో అరంగేట్రం

టీ నటరాజన్ ఐపీఎల్ 2020‌లో ఆకట్టుకోవడంతో టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. ఆపై అనుకోకుండానే ఈ పర్యటనలో నటరాజన్‌ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. దీంతో భారత్‌ తరఫున ఈ రికార్డు సృష్టించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 17వ ఆటగాడిగా నిలిచాడు. నటరాజన్‌కు తొలుత మూడో వన్డేలో అవకాశం రావడంతో రెండు వికెట్లు తీశాడు.

ఆ ప్రదర్శనతో టీ20 జట్టులో అడుగుపెట్టాడు. 6 వికెట్లు తీయడంతో భారత్‌ సిరీస్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టెస్టు సిరీస్‌లో భారత ప్రధాన పేసర్లంతా గాయపడడంతో నటరాజన్‌కు ఈ ఫార్మాట్‌లోనూ అవకాశం వచ్చింది.

కోహ్లీతో ఆ చిన్న సంభాషణ.. నా ఆటతీరునే మార్చేసింది: విండీస్ ప్లేయర్

Story first published: Friday, January 29, 2021, 13:21 [IST]
Other articles published on Jan 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+