న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ భవిష్యత్తుపై బీసీసీఐ సమాధానం చెప్పాలి: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan Says Question Regarding MS Dhoni Needs to be Answered by BCCI

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టత ఇవ్వాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీష్ ఓటమి అనంతరం ఆటకు దూరమైన ధోనీ.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టింది లేదు. తొలుత ఆర్మీలో సేవలు.. ఆ తర్వాత క్రికెట్ గురిచి ప్రశ్నించవద్దని సూచించిన ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ 2020 సీజన్‌తో పునరాగమనం చేయాలనుకున్నాడు. ఈ మధ్య కాలంలో ఎలాంటి క్రికెట్ ఆడలేదు. దీంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కూడా కోల్పోయాడు. దీంతో అతని కెరీర్ ముగిసినట్టేనని కొందరు అభిప్రాయపడగా.. ఐపీఎల్‌తో ధోనీ భవితవ్యం తేలనుందని మరికొందరు అంచనా వేశారు.

కానీ కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన బీసీసీఐ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను రద్దు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ధోనీ భవిష్యత్తుపై మరోసారి గందరగోళం నెలకొంది.

కరోనా కట్టడికి విరుష్క విరాళం!!కరోనా కట్టడికి విరుష్క విరాళం!!

ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో ధోనీ ఆడటంపైనా సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు భారత్ జట్టుకు ధోనీ దూరమైనా.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌‌కు వరుసగా సెలక్టర్లు అవకాశమిస్తున్నారు. దీంతో.. ధోనీ వారుసులుగా ఈ ఇద్దరిలోనే ఒకరికి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ధోనీ మళ్లీ టీమిండియాకి ఆడతాడా..? అనే ప్రశ్నను ఇర్ఫాన్ పఠాన్ ముందుంచుగా.. ఈ విషయాన్ని బీసీసీఐ తేల్చాలన్నాడు.

'ధోనీ తప్పకుండా మళ్లీ టీమిండియాకి ఆడాలి. అతను ఓ అద్భతమైన క్రికెటర్. కానీ.. ఇటీవల అతను జట్టుకు దూరమయ్యాడు. దాంతో అతని స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌‌ను వరుసగా ఆడిస్తున్నారు. వారు కూడా గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్నారు. కానీ.. ధోనీకి బదులుగా వారిని ఆడించడం కరెక్టేనా..? అనేది ఇప్పుడు ప్రశ్న. బీసీసీఐ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి' అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, March 30, 2020, 15:13 [IST]
Other articles published on Mar 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X