Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతన్ని సరిగ్గా వాడుకోండి.. మరో పదేళ్లు టీమిండియాకు పనికొస్తాడు: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan says If Deepak Hooda offers India six-seven good years

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతన్ని సరిగ్గా వాడుకుంటే, మరో 10 ఏళ్లు టీమిండియాకు పనికొస్తాడని తెలిపాడు. అనుకోకుండా జట్టులోకి వచ్చిన దీపక్ హుడా.. ఆ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడని తెలిపాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న దీపక్ హుడా తొలి రెండు వన్డేల్లో తనదైన పాత్ర పోషించాటు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే హుడా గురించి మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. అతన్ని సరిగ్గా వాడుకోవాలని సూచించాడు.

'రెండేళ్ల క్రితం దీపక్ హుడా కూడా టీమిండియాలోకి వస్తానని అనుకుని ఉండడు. ఇప్పుడు జట్టులోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. జట్టులోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలోనే దీపక్ హుడా సగం విజయం సాధించేశాడు. అతను భారత జట్టుకి ఫ్యూచర్ ఆల్‌రౌండర్. ఇప్పుడు అతని వయసు 27 ఏళ్లు మాత్రమే. అతన్ని సరిగ్గా వాడుకంటే మరో 10 ఏళ్లు భారత జట్టుకి ఆడగలడు. ఎంతలేదన్నా మరో ఆరేడు ఏళ్లు మంచిగా రాణించగలడు.. ఇంకా అతను సాధించాల్సిందిగా చాలా ఉంది.

Irfan Pathan says If Deepak Hooda offers India six-seven good years

ఫలితం ఆశించి పని చేస్తే రిజల్ట్ ఎప్పుడూ రాదని నేను అతనికి చెప్పాను. ఫలితం గురించి ఆలోచించకుండా నీ బెస్ట్ ఇవ్వాల్సిందిగా సూచించాను.. రిజల్ట్ వస్తే మంచిదే, రాకపోతే మరింత మెరుగ్గా రాణించడానికి ప్రయత్నించమని చెప్పా. అతను ఫార్మాట్‌ని బట్టి క్రీజును వాడుకునే విధానం కూడా మారుస్తున్నాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడుతూ దూకుడు పెంచాలో హుడాకి బాగా తెలుసు. ముఖ్యంగా గ్యాప్‌లను రాబట్టి బౌండరీలు చేయడంలో హుడా దిట్ట.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, July 26, 2022, 17:03 [IST]
Other articles published on Jul 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+