Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌లో అతనితోనే ముందుగా బౌలింగ్ చేయించాలి: ఇర్ఫాన్ పఠాన్

 Irfan Pathan says Bhuvneshwar Kumar should be used upfront ahead of T20 World Cup 2022

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే నెల నుంచి జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్ కుమార్‌తోనే రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేయించాలని దిగ్గజ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. కొత్త బంతితో భువీ అద్భుతంగా బౌలింగ్ చేయగలడని చెప్పిన పఠాన్.. బుమ్రా, అర్ష్‌దీప్, హర్షల్‌పటేల్‌లతో డెత్ ఓవర్లు వేయించాలన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై కొందరు తప్పుబడుతున్నారు.

పవర్ ప్లేలో భువీతో..

పవర్ ప్లేలో భువీతో..

గాయం నుంచి కోలుకొని పేసర్లు బుమ్రా, హర్షల్‌ పటేల్ జట్టులోకి వచ్చారు. భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌తోనే ఆసియా కప్‌ను ఆడిన భారత్‌కు.. బుమ్రా, హర్షల్‌ రాకతో బౌలింగ్ దళం మరింత బలోపేతం కానుంది. ఈ క్రమంలో కొత్త బంతిని ఎవరికి ఇస్తారనే చర్చకు తెరలేసింది. ఆసియా కప్‌లో భువనేశ్వర్‌తోనే కెప్టెన్‌ రోహిత్ బౌలింగ్‌ దాడిని ప్రారంభించాడు. ఆరంభ ఓవర్లలో అద్భుతంగా వేసిన భువీ.. డెత్‌ ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలయ్యాడు. కానీ అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో వరుసగా నాలుగు ఓవర్లు వేసిన భువీ ఐదు వికెట్లతో చెలరేగాడు. దాంతో టోర్నీలో మొత్తం 11 వికెట్లు పడగొట్టి హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.

బుమ్రా, హర్షల్‌తో డెత్ ఓవర్లలో...

బుమ్రా, హర్షల్‌తో డెత్ ఓవర్లలో...

ఈ నేపథ్యంలో కొత్త బంతితో అద్భుతంగా వేసే భువనేశ్వర్‌కే ప్రపంచకప్‌లోనూ మొదట బౌలింగ్‌ ఇవ్వాలని పఠాన్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్‌షోలో మాట్లాడిన పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'బుమ్రా, అర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌ ముగ్గురూ కలిసి డెత్‌ ఓవర్లలో ఆఖరి ఐదు ఓవర్లను కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయగలరు. గాయం నుంచి కోలుకుని వచ్చారు కాబట్టి బుమ్రా, హర్షల్‌కు ఆసీస్‌, దక్షిణాఫ్రికా జట్లతో మ్యాచుల్లో డెత్‌ ఓవర్లను వేయించాలి. కాస్త కుదురుకొని ఫామ్‌లోకి వచ్చేందుకు అవకాశం వచ్చినట్లు అవుతుంది.

డెత్ బౌలింగ్ సరిగ్గా లేకనే..

డెత్ బౌలింగ్ సరిగ్గా లేకనే..

ఆసియా కప్‌లో డెత్‌ ఓవర్లలోనే భారత్‌ తడబడింది. వారిద్దరి రాకతో ఆ సమస్య తీరిపోయినట్లే. అందుకే భువనేశ్వర్‌ కుమార్‌తో కొత్త బంతితోనే ఓవర్ల కోటాను పూర్తి చేయిస్తేనే మంచిది'అని ఇర్ఫాన్‌ పఠాన్‌ సూచించాడు. ఆసియా కప్‌లో పాక్‌పై 19వ ఓవర్‌లో 19 పరుగులు, శ్రీలంకపై 14 పరుగులను భువనేశ్వర్‌ ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ కట్టుదిట్టంగా బంతులను సంధించినా ఫలితం లేకపోయింది. దాంతో కీలక మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది.

Story first published: Tuesday, September 13, 2022, 21:29 [IST]
Other articles published on Sep 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+