For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ భారత స్పిన్నర్‌‌తో స్టీవ్ స్మిత్‌కు చుక్కలే: ఇర్ఫాన్ పఠాన్

 Irfan Pathan says Axar Patel can be a big threat to Steve Smith ahead of Border-Gavaskar Trophy

న్యూఢిల్లీ: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా.. ఈ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఉండే స్పిన్ పిచ్‌‌లపై రాణించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే డానియర్ వెటోరిని తమ సహాయక కోచ్‌గా నియమించుకున్న ఆ జట్టు.. అశ్విన్, అక్షర్ పటేల్, జడేజా బౌలింగ్‌లను సమర్థవంగా ఎదుర్కొనేందుకు వారి బౌలింగ్ శైలిని పోలీ ఉన్న దేశవాళీ క్రికెటర్లతో సాధన చేస్తోంది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ అయిన అశ్విన్, యువ స్పిన్నర్ అక్షర్ పటేల్‌ బౌలింగ్ వీడియోలను నిశితంగా పరిశీలిస్తోంది.

అక్షర్‌తో స్మిత్‌కు కష్టమే..

అక్షర్‌తో స్మిత్‌కు కష్టమే..

అయితే ఆస్ట్రేలియా ఎంత సిద్దమైనా.. భారత స్పిన్నర్లతో ఆ జట్టుకు కష్టాలు తప్పవని మాజీ క్రికెటర్లు అంటున్నారు. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు పెద్ద సవాల్‌ అని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ హెచ్చరించాడు. అతని బౌలింగ్‌లో స్మిత్‌కు చుక్కలు తప్పవని తెలిపాడు. అయితే భారత్ కూడా స్మిత్‌ను తక్కువ అంచనా వేయకూడదని, సరైన ప్రణాళికలతో స్మిత్‌ను కట్టడి చేయాలని సూచించాడు.

 స్మిత్‌ను తక్కువ అంచనా వేయవద్దు..

స్మిత్‌ను తక్కువ అంచనా వేయవద్దు..

ఫిబ్రవరి 9న నాగ్‌పూర్ వేదికగా జరగనున్న తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'స్టీవ్‌స్మిత్‌.. అతను ఆస్ట్రేలియా సూపర్‌ స్టార్‌ బ్యాటర్. ఆసీస్‌ చరిత్రను ఒకసారి గమనిస్తే స్మిత్‌ అగ్రస్థానంలో ఉంటాడు. భారత బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి టన్నుల కొద్దీ పరుగులు సాధించాడు. ఆఫ్‌, లెగ్ సైడ్‌లో పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి టీమిండియా సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. అతన్ని కట్టడి చేయడం సవాలే.

అక్షర్ పటేల్ వల్లే సాధ్యం..

అక్షర్ పటేల్ వల్లే సాధ్యం..

కానీ, స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌కు అతడిపై మంచి గణాంకాలు ఉన్నాయి. అతను బంతిని సూటిగా విసురుతాడు కాబట్టి స్మిత్‌ను ఎల్బీ లేదా క్లీన్‌ బౌల్డ్‌ చేయగలడు. భారత జట్టులో పదే పదే బంతిని స్టంప్స్‌కి విసిరే ఏకైక ఆటగాడు అక్షర్‌. అతను క్రమం తప్పకుండా అన్ని మ్యాచులు ఆడితే కచ్చితంగా స్మిత్‌కు పెద్ద ఆటంకంగా మారుతాడు' అని ఇర్ఫాన్‌ పఠాన్ చెప్పుకొచ్చాడు. బెంగళూరు సమీపంలో ఆలూరులో ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ క్యాంప్‌లో ఆసీస్ సన్నదమవుతుండగా.. నాగ్‌పూర్‌లో భారత్ ప్రిపేర్ అవుతోంది.

Story first published: Saturday, February 4, 2023, 22:14 [IST]
Other articles published on Feb 4, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+