For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షాహిద్ అఫ్రిది కుక్క మాంసం తినేటోడు.. అందుకే మొరుగుతా ఉంటాడు: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా చాలా చురుకుగా ఉంటాడు. క్రికెట్ మ్యాచ్‌లను విశ్లేషించడంతో పాటు తనపై వచ్చే ట్రోల్స్‌కు అదిరిపోయే కౌంటర్ ఇస్తుంటాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్.. తాను ఆడే రోజుల్లో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో చోటు చేసుకున్న వాగ్వాదాన్ని గుర్తు చేసుకున్నాడు. అనవసరంగా తనతో గొడవకు దిగిన అఫ్రిది నోరు ఎలా మూయించాననే విషయాన్ని వెల్లడించాడు.

పిల్ల చేష్టలతో గొడవ..

'2006 పాకిస్థాన్ పర్యటనలో మేం కరాచీ నుంచి లాహోర్‌కు విమానంలో ప్రయాణిస్తున్నాం. ఆ విమానంలో భారత ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. షాహిద్ అఫ్రిది నా దగ్గరికి వచ్చి నా జుట్టును చిందరవందర చేసి..'హాయ్ కిడ్.. ఎలా ఉన్నావ్?' అని అడిగాడు. అతని ప్రవర్తన నాకు తీవ్ర కోపం తెప్పించింది. నేను వెంటనే నువ్వు ఎప్పటి నుంచి నాకు తండ్రివి అయ్యావు అని అడిగాను. నిజానికి అతనే పిల్లచేష్టలతో నాకు కోపం తెప్పించాడు.అతను నాకు స్నేహితుడు కాదు. అయినా నా జట్టును చిందరవందర చేశాడు. నా మాటలకు సీరియస్ అయిన అఫ్రిది కొన్ని తిట్లు తిట్టాడు. నా సీటు పక్కనే అతని సీటు కూడా ఉంది. మరోవైపు నా పక్కన అబ్దుల్ రజాక్ కూర్చున్నాడు.

Irfan Pathan Recalls Shocking Verbal Spat with Shahid Afridi Saying He s Eaten Dog Meat Has Been Barking

కుక్క మాంసం తిన్నట్లున్నాడు..

నేను వెంటనే అతనితో ఇక్కడ ఏ రకమైన మాంసం దొరుకుతుందని అడిగాను. అతను కొన్ని రకాల మాంసాల పేర్లు చెప్పాడు. అప్పుడు నేను కుక్క మాంసం కూడా దొరుకుతుందా? అని అడిగాను. పక్కనే ఉన్న అఫ్రిది ఇది విన్నాడు. మరోవైపు రజాక్ షాక్ అయి.. 'ఏయ్ ఇర్ఫాన్, నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావ్?' అని అన్నాడు. నేను.. వెంటనే అతను (అఫ్రిది) కుక్క మాంసం తిన్నట్లున్నాడు. చాలా సేపటి నుంచి మొరుగుతూనే ఉన్నాడని చెప్పాను.

ఆ మాటలు విన్న అఫ్రిది మళ్లీ నోరెత్తలేదు. అతను ఏది మాట్లాడినా.. మళ్లీ మొరుగుతున్నాడని అనేవాడిని. ఈ వాగ్వాదం తర్వాత అతను మౌనంగా ఉండిపోయాడు. ఈ ఘటన తర్వాత మాటలతో నన్ను గెలవలేననే విషయాన్ని అఫ్రిది అర్థం చేసుకున్నాడు. మళ్లీ ఎప్పుడూ నాతో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదు.'అని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు.

Story first published: Saturday, August 16, 2025, 14:27 [IST]
Other articles published on Aug 16, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+