Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Irfan Pathan Playing XI vs Pakistan: రిషభ్ పంత్‌కు దక్కని చోటు.. దినేశ్‌ కార్తీక్‌కే ఇర్ఫాన్ ఓటు!

Irfan Pathan Picked Dinesh Karthik Ahead Of Rishabh Pant For T20 World Cup Opener Against Pakistan

న్యూఢిల్లీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా.. దాదాపు రెగ్యూలర్ టీమ్‌నే కొనసాగించింది. ఇక ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నా.. అప్పుడే తుది జట్టు ఎంపికపై తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆసియాకప్ వైఫల్యం నేపథ్యంలో టీమ్ కాంబినేషన్ విషయంలో రోహిత్ అండ్ కో జాగ్రత్తగా ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో
అక్టోబర్ 23న ఆడనుంది.

తుది జట్టుపై తీవ్ర చర్చ..

తుది జట్టుపై తీవ్ర చర్చ..

ఆసియాకప్‌లో పాక్‌తో భారత్ రెండు సార్లు తలపడగా.. ఒకసారి గెలిచి మరోసారి ఓడింది. మిడిలార్డర్ వైఫల్యం కారణంగానే ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే పకడ్బందీ ప్రణాళికలతో, అత్యుత్తమ కాంబినేషన్‌తో బరిలోకి దిగాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో అందరూ అనుభవజ్ఞులు కావడంతో పదకొండు మందిలో ఎవరు ఉంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన టీమ్‌ను ప్రకటించాడు. అయితే తన జట్టులో యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు మాత్రం చోటు కల్పించలేదు. అంతేకాకుంగా జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్‌ను ఎంపిక చేయలేదు.

 పంత్‌కు నో చాన్స్..

పంత్‌కు నో చాన్స్..

'టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. అందుకే నేను అనుభవం ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నా. ముఖ్యంగా అనుభవం కలిగిన బౌలర్లు ఉండేలా చూసుకున్నా. ఇక నా పదకొండు మంది ఆటగాళ్లు ఎవరంటే.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వస్తారు. మూడోస్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్‌ పాండ్య తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతారు.

ఏకైక స్పిన్నర్..

ఏకైక స్పిన్నర్..

ఇక ఏడో స్థానంలో దినేశ్‌ కార్తిక్‌ను ఎంపిక చేసాను. తర్వాత కుడిచేతి లెఫ్టార్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌తోపాటు జస్ప్రీత్‌ బుమ్రా, హర్షల్‌ పటేల్, భువనేశ్వర్‌ కుమార్‌ నా తుది జట్టులో ఉంటారు. నేనిచ్చిన కాంబినేషన్‌లో ముగ్గురు ప్రధాన ఫాస్ట్‌ బౌలర్లు ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు డెత్‌ ఓవర్లలో వేయగల సమర్థులు. అర్ష్‌దీప్‌ కూడా మంచి బౌలరే కానీ.. అనుభవం ప్రకారం వీరివైపు మొగ్గు చూపాను'అని పఠాన్ చెప్పుకొచ్చాడు. ఇక ఆరో బౌలింగ్ ఆప్షన్‌గా దీపక్ హుడాను వాడుకోవచ్చన్నాడు. అయితే జట్టు మొత్తం రైట్ హ్యాండ్ బ్యాటర్లే ఉండటం గమనార్హం.

 ఇర్ఫాన్ పఠాన్ తుది జట్టు:

ఇర్ఫాన్ పఠాన్ తుది జట్టు:

రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్

Story first published: Thursday, September 15, 2022, 17:36 [IST]
Other articles published on Sep 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+