Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మీరు మోసగాళ్లు.. మీ అయ్యవ్వ మీకు నేర్పింది ఇదేనా? అన్నాడు: ఇర్ఫాన్ పఠాన్

శ్రీలంక దిగ్గజ వికెట్ కీపర్ కుమార సంగక్కరతో చోటు చేసుకున్న వాగ్వాదాన్ని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. తీవ్రమైన పదజాలంతో సంగక్కర దూషించాడని పఠాన్ చెప్పుకొచ్చాడు. 2005లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి ఇర్ఫాన్ పఠాన్ ఓపెనింగ్ చేసి 93 పరుగులు చేశాడు. అయితే శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా అంపైర్ బంతిని మార్చడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక ఆటగాళ్లు తప్పుబట్టారు. బంతిని మార్చడం భారత బౌలర్లకు అడ్వాంటేజ్‌గా మారిందని మ్యాచ్ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా కుమార సంగక్కర తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ చేస్తుండగా అతనిపై నోరు పారేసుకున్నాడు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.

Irfan Pathan Opens Up on Kumar Sangakkara s Fiery Sledge You Guys Cheat Your Parents Teach You This

మీ అయ్యవ్వ నేర్పింది ఇదేనా..?

తాజాగా జియోస్టార్ షోలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్ ఈ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు. 'ఢిల్లీలో జరిగిన మ్యాచ్ అది. నేను ఓపెనర్‌గా వచ్చి 93 పరుగులు చేశాను. తొలి ఇన్నింగ్స్ అనంతరం మేం బౌలింగ్ చేసిన సమయంలో బంతిని మార్చారు. దాంతో శ్రీలంక ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సంగక్కర మరింత అసహనానికి గురై నోటికి పని చెప్పాడు. అయితే నాకు ఇదేది తెలియదు. నేను బ్యాటింగ్‌కు దిగి మురళిదరణ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాదాను.

కొత్త బంతినే సిక్స్‌గా తరలించడంతో శ్రీలంక ప్రణాళికలు తలకిందులయ్యాయి. దాంతో ఆగ్రహానికి గురైన సంగక్కర.. సడెన్‌గా వికెట్ల నుంచి స్లెడ్జింగ్ చేయడం ప్రారంభించాడు. మీరు(భారత ఆటగాళ్లు) ఛీటర్స్.. మీ తల్లిదండ్రులు మీకు నేర్పింది ఇదేనా అంటూ నోరు పారేసుకున్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నేను అదే రీతిలో బదులిచ్చాడు. దాంతో గొడవ వ్యక్తిగత స్థాయికి వెళ్లింది.

నేనే వెళ్లి సారీ చెప్పా..

ఐపీఎల్ అరంగేట్ర సీజన్ కోసం జరిగిన వేలం‌లో నేను, కుమార సంగక్కర ఒకే జట్టుకు ఎంపికయ్యాం. దాంతో ఇద్దరం కలిసి ఆడాల్సి వచ్చింది. టోర్నీ ఆరంభంలో ఒక రోజు సంగక్కర కుటుంబంతో కలిసి భోజనం చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను వెంటనే వెళ్లి అతనికి క్షమాపణలు చెప్పాను. అతను కూడా తిరిగి సారీ చెప్పాడు. దాంతో మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడప్పుడు భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. తప్పులు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ వాటిని ఎంత పరిణతితో ఫేస్ చేస్తారనేదే ముఖ్యం.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, August 11, 2026, 20:31 [IST]
Other articles published on Aug 11, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+