For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాలో అతను అనర్హుడు: ఇర్ఫాన్ పఠాన్

ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ‌ని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా విమర్శించాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడని, ఆటలో టెక్నికల్ లోపాన్ని అధిగమించని కోహ్లీకి భారత జట్టులో చోటు లేదన్నాడు. టీమిండియా‌లో స్టార్ సంస్కృతికి తెరదించాలని సెలెక్టర్లను కోరాడు. ప్రస్తుతం ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 1-3తో ఆసీస్‌కు కోల్పోయింది. 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకుంది. ఈ సిరీస్ విజయంతో ఆసీస్ వరుసగా రెండో సారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో సౌతాఫ్రికాతో తలపడనుంది.

Irfan Pathan feels Virat Kohli doesn t deserve place in Indian team over BGT failure

ఈ పరాజయంతో తీవ్ర నిరాశకు గురైన ఇర్ఫాన్ పఠాన్.. టీమిండియాలో అనేక మార్పులు చేయాలని సెలెక్టర్లకు సూచించాడు. ఈ క్రమంలో కోహ్లీ ఫామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దేశవాళీ క్రికెట్ ఆడకపోవడాన్ని తప్పుబట్టాడు.

'టీమిండియాలో స్టార్ సంస్కృతికి తెరదించాలి. ఆటగాళ్ల కంటే జట్టే ముఖ్యం అనే సంప్రదాయాన్ని తీసుకు రావాలి. ఆటగాళ్లు ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకుంటూ భారత జట్టును మెరుగుపరుచుకోవాలి. సిరీస్‌కు ముందు చాలా మ్యాచ్‌లు జరిగాయి. దేశవాళీ క్రికెట్‌లో ఆడే అవకాశం కూడా ఉండింది. కానీ సీనియర్ ఆటగాళ్లు ఎవరూ ఆడలేదు.

ఇలాంటి సంస్కృతిని మార్చాలి. దేశవాళీ క్రికెట్‌లో కోహ్లీ చివరిసారిగా ఎప్పుడు ఆడాడు? అతను దేశవాళీ క్రికెట్ ఆడక 10 ఏళ్లు అవుతోంది. గత ఐదేళ్లలో అతని యావరేట్ 30 కూడా లేదు. ఇలాంటి సీనియర్ ఆటగాడు జట్టుకు అర్హుడా? అతని స్థానంలో యువ ఆటగాడికైనా అవకాశం ఇవ్వండి. ఇది వ్యక్తుల గురించి కాదు.. జట్టుకు సంబంధించిన విషయం.'అని ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

Irfan Pathan feels Virat Kohli doesn t deserve place in Indian team over BGT failure

ఇక ఎన్నో అంచనాలతో ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఐదు టెస్ట్‌ల్లో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీలకే ఔటయ్యాడు. పెర్త్ టెస్ట్‌ సెంచరీ మినహా మరే మ్యాచ్‌లోనూ కోహ్లీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఊరించే ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు వికెట్ పారేసుకున్నాడు.

ఈ సిరీస్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ వరుసగా 5, 100 నాటౌట్, 7, 11, 3, 36, 5, 17, 6 పరుగులతో మొత్తం 190 పరుగులే చేశాడు.

Story first published: Monday, January 6, 2025, 9:45 [IST]
Other articles published on Jan 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+