Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్కడ ఇజ్రాయెల్‌ X పాలస్తీనా.. ఇక్కడ ఇర్ఫాన్ పఠాన్ X కంగనా రనౌత్!

Irfan Pathan criticizes Kangana Ranaut for allegedly spreading ‘hate’ among netizens
Irfan Pathan Criticizes Kangana Ranaut | Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తోంది. పాలస్తీనాలో జరుగుతున్న హింసను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా పాలస్తీనాకు మద్దతుగా ట్వీట్ చేశారు. 'మీలో ఏ మాత్రం మానవత్వం ఉన్నా.. పాలస్తీనాలో జరుగుతున్న హింసను ఖండిస్తారు'అని పేర్కొన్నాడు. అయితే ఈ ట్వీట్‌పై ఓ వర్గం నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సైతం ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్‌ను తప్పుబట్టింది.

'ఇర్ఫాన్ పఠాన్‌కు ఇతర దేశాలపై అమితమైన ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశం బెంగాల్‌లో జరిగిన హింసపై మాత్రం ట్వీట్ చేయలేకపోయాడు'అని కంగనా తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇర్ఫాన్ పఠాన్.. ఈ తరహా పోస్ట్‌లు, ద్వేషంతోనే కంగనా ట్విటర్ అకౌంట్ సస్పెండ్ అయిందని చురకలంటించాడు. తన్వ ట్వీట్లన్నీ మానవత్వంతో చేసినేవనని, కానీ కంగనా, ఆమెలాంటి పెయిడ్ అకౌంట్స్ కొన్ని ద్వేషాన్ని వ్యాప్తి చేస్తాయన్నాడు.

'నా ట్వీట్లన్నీ మానవత్వం ఉన్న మనిషిగా చేసినవే. దేశానికి అత్యున్న స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన ఓ వ్యక్తిగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నా. కానీ కంగనా, ఆమెలాంటి పెయిడ్ అకౌంట్స్ ద్వేషాన్ని వ్యాప్తి చెస్తున్నాయి. దాంతో వారి ఖాతాలు సస్పెన్షన్‌కు గురయ్యాయి'అని పఠాన్ ట్వీట్ చేశాడు. పాలస్తీనాపై జరుగుతున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరు దేశాలు ఒకరిపై మరొకరు రాకెట్ దాడులు చేసుకుంటున్నాయి.

Story first published: Thursday, May 13, 2021, 20:42 [IST]
Other articles published on May 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+