Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతన్ని ఒక్కసారి ఔట్ చేయలేకపోయారు.. ఇదేం బౌలింగ్: ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా బౌలర్లపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోరూట్‌ను భారత బౌలర్లు ఒక్కసారి కూడా ఔట్ చేయలేకపోయారని అసహనం వ్యక్తం చేశాడు. తుది జట్టు‌లో రిస్ట్ స్పిన్నర్ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. టీమ్ కాంబినేషన్ సరిగ్గా లేదంటూ పరోక్షంగా మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పించాడు.

IND vs ENG: సెంచరీ తర్వాత గంభీర్‌తో రోహిత్ శర్మ వాగ్వాదం!(వీడియో)

IND vs ENG: సెంచరీ తర్వాత గంభీర్‌తో రోహిత్ శర్మ వాగ్వాదం!(వీడియో)

ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ముగించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఐకానిక్ లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన మూడో వన్డేలో 27 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. రోహిత్ శర్మ(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 138) సెంచరీతో చెలరేగినా.. విరాట్ కోహ్లీ(74), శుభ్‌మన్ గిల్(77) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. దాంతో ఈ మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. దాంతో 7 ఏళ్ల తర్వాత భారత్‌పై ఇంగ్లండ్ వన్డే సిరీస్ గెలిచింది.

Irfan Pathan Criticises Indian Bowlers Says No One Could Get Joe Root s Wicket in ODI Series vs England

ఒక్క బౌలర్ కూడా ఔట్ చేయలేకపోయాడు..

ఈ మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో జోరూట్ 76 నాటౌట్, 99 నాటౌట్, 74 నాటౌట్ అజేయంగా నిలిచాడు. ఒక్క మ్యాచ్‌లోనూ అతన్ని భారత బౌలర్లు ఔట్ చేయలేకపోయారు. ఇదే విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ప్రస్తావించిన ఇర్ఫాన్ పఠాన్.. భారత బౌలింగ్ ప్రణాళికలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'తీవ్ర ఒత్తిడిలో ఉన్నరోహిత్ శర్మ పరుగులు చేయడం, కోహ్లీ నిలకడగా రాణిస్తుండటం మంచి విషయం. భారత్ ఓడినా గొప్పగా పోరాడింది. కానీ ఈ సిరీస్‌లో భారత బౌలర్లు ఒక్కసారి కూడా జోరూట్‌ను ఔట్ చేయలేకపోయారు. ఒక్క బౌలర్ కూడా అతని వికెట్ తీయలేకపోయాడు. తుది జట్టులో రిస్ట్ స్పిన్నర్ ఉంటే భిన్నంగా ఉండేది. కానీ నలుగు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగినప్పుడు.. జోరూట్‌ను ఔట్ చేసే సామర్థ్యం, ప్రణాళికను కచ్చితంగా కలిగి ఉండాలి.

క్రికెట్‌కు కోహ్లీ, రోహిత్.. 2 నెలలు దూరం! మళ్లీ ఎప్పుడు ఆడుతారంటే?

క్రికెట్‌కు కోహ్లీ, రోహిత్.. 2 నెలలు దూరం! మళ్లీ ఎప్పుడు ఆడుతారంటే?

లైన్ అండ్ లెంగ్త్‌పై నియంత్రణ లేదు..

కొత్త బంతితో భారత పేసర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు. ఈ తప్పిదాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు సద్వినియోగం చేసుకున్నారు. కొత్త బంతితో వికెట్లు తీయలేదు. మిడిల్ ఓవర్లలో కూడా పరిస్థితిని చక్కదిద్దే బౌలర్లు లేరు. ప్రిన్స్ యాదవ్ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. లైన్ అండ్ లెంగ్త్‌పై నియంత్రణ లేకుండా బౌలింగ్ చేశాడు.

డెత్ ఓవర్లలో టీమిండియా అనుసరించిన ప్రణాళికలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. జోస్ బట్లర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. బట్లర్ జరిగి ఆడుతున్నా.. భారత బౌలర్లు వైడ్ యార్కర్లే వేయలేదు. ఇది చాలా బేసిక్ ప్రణాళిక.'అని ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశాడు. చెత్త బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, July 20, 2026, 16:37 [IST]
Other articles published on Jul 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+