Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా ఫొటో మార్చి.. పాక్ మీడియా ఫేక్ స్టోరీ అల్లేసింది: ఇర్ఫాన్ పఠాన్

తనపై ట్రోలింగ్, తప్పుడు ప్రచారం ప్రతీ రోజు జరుగుతూనే ఉంటుందని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. పాకిస్థాన్‌లో అయితే తన ఫొటోను మార్చేసి ఫేక్ కథనాన్ని సృష్టించారని, అది తాను ఎప్పటికీ మర్చిపోనని తెలిపాడు.

బాబర్ ఆజామ్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు తాను ప్రయత్నించానని, అతను ఇవ్వలేదని పాక్ మీడియా ఫేక్ కథనాన్ని వండివార్చిందని పఠాన్ గుర్తు చేసుకున్నాడు. జియోస్టార్ చీకీ సింగిల్స్ షోలో మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్.. తాను అసలు బాబర్ ఆజామ్ ఇంటర్వ్యూ కోసమే ప్రయత్నించలేదని స్పష్టం చేశాడు.

IPL 2027: ముంబై ఇండియన్స్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై!

IPL 2027: ముంబై ఇండియన్స్‌కు మరో స్టార్ ప్లేయర్ గుడ్ బై!

పాక్ మీడియా ఫేక్ స్టోరీ అల్లేసింది..

'ప్రస్తుత కాలంలో ట్రోలింగ్ సర్వసాధారణం. అలాగే ఎవరిపైనైనా సునాయసంగా నిందల్ని మోపడం చూస్తున్నాం. పాకిస్థాన్ మీడియా అయితే ఏకంగా నా మీద పెద్ద ఫేక్ స్టోరీనే క్రియేట్ చేసింది. బాబర్ ఆజామ్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు నేను వెళ్లానని.. అతను మాత్రం ఇచ్చేందుకు నిరాకరించాడనే కథనాన్ని వండివార్చింది.

Irfan Pathan Clarifies Viral Claim About Travelling to Pakistan to Interview Babar Azam

నేను పాక్‌ను ట్రోల్ చేశానని అందుకే ఇంటర్వ్యూ ఇవ్వనని బాబర్ అన్నట్లుగా ఆ కథనంలో పేర్కొంది. ఫొటో‌షాప్ సాయంతో నా ఫేస్‌ను ఎడిట్ చేసి వాడేసింది. అయితే అదంతా అవాస్తవమని తేలిపోయింది. బంగ్లాదేశ్‌‌కు చెందిన ఓ యువ పాత్రికేయుడి శరీరానికి నా ముఖాన్ని అతికించి ఫేక్ స్టోరీని ప్రచారం చేసింది.

ఆ ఫేక్ కథనానికి లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. అది నిజమేనని చాలా మంది నమ్మారు. ఇప్పుడు ఇలాంటివి ప్రతీ రోజు వస్తున్నాయి. కానీ, వాటికి నేను స్పందించను. ప్రతీదానికి స్పందిస్తూ వెళ్తే.. మన జీవితాన్ని ప్రశాంతంగా గడపలేం.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

ప్రీతి జింటా వండి పెట్టింది..

ఐపీఎల్ 2009 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా స్వయంగా వండి పెట్టిందని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేసుకున్నాడు. 'ఓ ఆటగాడిగా మీరు గొప్ప వారసత్వం క్రియేట్ చేయాలంటే మాత్రం.. ఐపీఎల్ లేదా ఇతర ఏ లీగ్‌లోనైనా ఓ ఫ్రాంచైజీ సుదీర్ఘ కాలం ఆడాలి. ఐపీఎల్‌లో నా తొలి జట్టు పంజాబ్. ఆ టీమ్ తరఫున నేను మూడేళ్లు ఆడా. పంజాబ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ మాత్రం అద్భుతం. 2009 సీజన్‌లో వరుస పరాజయాలతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్నాం.

భారత్ గెలవాలంటే.. ఆ ఆర్‌సీబీ హీరోను జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

Also Read

భారత్ గెలవాలంటే.. ఆ ఆర్‌సీబీ హీరోను జట్టులోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్

అప్పుడు ప్రీతీ జింటా.. తర్వాత మ్యాచ్‌లో గెలిస్తే మంచి భారతీయ భోజనం ఏర్పాటు చేయిస్తానని, తానే స్వయంగా పరోటాలు చేసి పెడతానని చెప్పింది. మేం గెలవడంతో అలాగే చేసి పెట్టి మాట నిలబెట్టుకుంది. ఆటలో గెలుపోటములు సహజం. కానీ జట్టు‌ను ప్రోత్సహించేలా మేనేజ్‌మెంట్ ఉంటే ప్లేయర్లకు అదనపు బలమే అవుతుంది.'అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 7, 2026, 17:45 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+