Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ireland vs Pakistan: మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ విధ్వంసం.. పసికూనపై పాక్ ఘన విజయం!

ఐర్లాండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్.. ఎట్టకేలకు విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన రెండో టీ20లో మహమ్మద్ రిజ్వాన్(46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 75 నాటౌట్), ఫకార్ జమాన్(40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 193 పరుగులు చేసింది. లోర్కన్ టెక్టర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. గరెత్ డెలనీ(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

Ireland vs Pakistan Mohammed Rizwan and Fakhar Zaman help Pakistan beat Ireland in 2nd T20I

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/49) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిదీ(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అమీర్, నసీమ్ షా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ డకౌటవ్వగా.. ఆజామ్ ఖాన్(10 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) ధాటిగా ఆడాడు. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20 మంగళవారం జరగనుంది.

టీ20 ప్రపంచకప్ 2024‌కు సన్నాహకంగా పాకిస్థాన్ ఈ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తమ ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్‌నెస్ లెవెల్స్‌ను పరిగణలోకి తీసుకొని టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఎంపిక చేయనుంది. మెగా టోర్నీకి సంబంధించిన జట్టును పాకిస్థాన్ ఇంకా ప్రకటించలేదు. మే 24 వరకు గడువు ఉండటంతో బలమైన జట్టును ఎంపిక చేసేందుకు పాకిస్థాన్ కసరత్తులు చేస్తోంది.

Story first published: Monday, May 13, 2024, 12:04 [IST]
Other articles published on May 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+