Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐర్లాండా..మజాకా - టీమిండియా తరువాత అదే..!!

 Ireland settled at number 2 position in Group 1 points table after the match abandoned against Afghan

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ను వర్షం వెంటాడుతూనే ఉంది. తొలి రోజు నుంచీ దెబ్బకొడుతూనే వస్తోంది. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం బారిన పడి, రద్దయింది. దక్షిణాఫ్రికా-జింబాబ్వే పోరు ఫలితం కూడా తేలలేదు. డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఇంగ్లాండ్ సైతం తన కంటే చిన్న జట్టు చేతిలో పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది వర్షం బెడద వల్ల. ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోయిందా టైటిల్ హాట్ ఫేవరెట్. ఇలా ప్రతి రోజూ టీ20 ప్రపంచకప్‌కు వర్షం ఆటంకం కలిగిస్తూనే వస్తోంది.

వదలని వాన..

వదలని వాన..

ఇవ్వాళ కూడా అది వదల్లేదు. ఐర్లాండ్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు అడ్డుపడింది. ఐర్లాండ్‌కు దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌ను ఓడించి ఫుల్ జోష్ మీద ఉన్న జట్టు ఐర్లాండ్. ఆఫ్ఘనిస్తాన్‌ను మట్టి కరిపించడానికి ఉవ్విళ్లూరుతోన్న తరుణంలో భారీ వర్షం కురిసింది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని ముంచెత్తింది. సమయం గడుస్తున్నప్పటికీ తెరపినివ్వలేదు. ఫలితంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయింది.

ఒక్క పాయింట్‌తోనే..

ఒక్క పాయింట్‌తోనే..

దీనితో ఐర్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. ఒక్కో పాయింట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ మాటెలా ఉన్నప్పటికీ- ఐర్లాండ్‌కు మాత్రం ఇది నిరుత్సాహాన్ని కలిగించే విషయమే. ఈ మ్యాచ్‌లో గనక గెలిచి ఉంటే గ్రూప్-1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకి ఉండేది ఐర్లాండ్. గెలుస్తుందనే అంచనాలు కూడా ఆ జట్టు మీద ఉన్నాయి. ఎందుకంటే- తన కిందటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించింది కాబట్టి.

గ్రూప్ 1లో సెకెండ్..

గ్రూప్ 1లో సెకెండ్..

మ్యాచ్ రద్దు కావడం వల్ల దక్కింది ఒక్క పాయింటే అయినప్పటికీ- గ్రూప్ 1లో రెండో స్థానానికి ఎగబాకింది టీమ్ ఐర్లాండ్. రద్దయిన మ్యాచ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మూడు మ్యాచ్‌లను ముగించుకుందీ జట్టు. ఒకదాంట్లో ఓడింది.. మరో మ్యాచ్‌లో ఘన విజయాన్ని అందుకుంది. మొత్తంగా మైనస్ 1.169 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది న్యూజిలాండ్. మూడు మ్యాచ్‌లల్లో ఒకదాంట్లో ఘన విజయం సాధించగా.. మరొకటి వర్షం వల్ల రద్దయింది.

గ్రూప్ 2 భారత్ టాపర్..

గ్రూప్ 2 భారత్ టాపర్..

గ్రూప్-2లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌లు - రెండు విజయాలతో నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది రోహిత్ సేన. నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపడింది. 1.425గా రికార్డయింది. ఈ గ్రూప్‌లో రెండో స్థానానికి ఎగబాకింది దక్షిణాఫ్రికా. రెండు మ్యాచ్‌లల్లో ఒకటి రద్దు కాగా.. మరో దాంట్లో విజయం సాధించింది ప్రొటీస్ టీమ్. మూడు పాయింట్ల ఈ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ 5.200గా నమోదైంది.

వదలని వర్షం..

వదలని వర్షం..

సూపర్ 12లో ఇప్పటివరకు మొత్తం 13 మ్యాచ్‌లు జరగ్గా- మూడు రద్దయ్యాయి. ఒక మ్యాచ్‌ను కుదించాల్సి వచ్చింది. ఇక ఆలస్యంగా మొదలైనవి మెజారిటీ సంఖ్యలో ఉన్నాయి. ఇక మున్ముందు కూడా వర్షం ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. మెల్‌బోర్న్, సిడ్నీ, పెర్త్ నగరాల్లో రోజూ వర్షం పడుతోంది. ఏదో సమయంలో కుమ్మేస్తోంది. ఫలితంగా మ్యాచ్‌లు పూర్తిగా రద్దు కావడమో, ఓవర్లను కుదించాల్సి రావడమో జరుగుతోంది.

పాకిస్తాన్- జింబాబ్వే దేశాధినేతల మధ్య మాటల తూటాలు - పాక్ ప్రధాని ఘాటు రిప్లై

Story first published: Friday, October 28, 2022, 13:37 [IST]
Other articles published on Oct 28, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+