పాకిస్తాన్- జింబాబ్వే దేశాధినేతల మధ్య మాటల తూటాలు - పాక్ ప్రధాని ఘాటు రిప్లై

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై జింబాబ్వే సాధించిన విజయం పెను సంచలనంగా మారింది. గతంలో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో అప్పట్లో టైటిల్ హాట్ ఫేవరెట్ వెస్టిండీస్‌ను ఓడించిన ఉదంతాన్ని గుర్తుకు తెచ్చింది. 130 పరుగులను కాపాడుకోవడంలో జింబాబ్వే ప్లేయర్లు చూపించిన తెగువను ప్రశంసించకుండా ఉండలేకపోతోన్నారందరూ. ఓడింది పాకిస్తాన్ కావడంతో ఇటు భారత్‌లోనూ సెలబ్రేషన్స్ మిన్నంటాయి. జింబాబ్వే జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు ఫ్యాన్స్.

మాటల యుద్ధం..
ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికీ దారి తీసింది. జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్ డాంబుడ్జో ఎంనంగగ్వా చేసిన కామెంట్స్ పట్ల పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. తమ వద్ద క్రికెటింగ్ స్పిరిట్ ఉందంటూ ఎదురుదాడికి దిగారు. జింబాబ్వే అధ్యక్షుడికి బదులిచ్చారు. ఈ పరిణామం- రెండు దేశాల క్రికెట్ అభిమానులను మరింత రెచ్చగొట్టినట్టయింది. పరస్పరం కౌంటర్ అటాక్ చేసుకుంటోన్నారు.

రియల్ మిస్టర్ బీన్..
పాకిస్తాన్‌పై జింబాబ్వే సాధించిన తిరుగులేని విజయం పట్ల ఎమర్సన్ డాంబుడ్జో స్పందించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌కు చురకలు అంటించారు. క్రెగ్ ఇర్విన్ సారథ్యంలోని జింబాబ్వే జట్టును అభినందిస్తూ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. కంగ్రాట్యులేషన్స్ టు చెవ్రాన్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ దఫా తమ దేశానికి ఫేక్ కాకుండా రియల్ మిస్టర్ బీన్‌ను పంపాలంటూ ఎద్దేవా చేశారు.

పాక్ ప్రధాని రిప్లై..
దీనికి పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ రిప్లై ఇచ్చారు. తమ వద్ద రియల్ మిస్టర్ బీన్ లేడని అంగీకరించారు. నిజానికి రియల్ మిస్టర్ బీన్ తమ వద్ద లేకపోవచ్చు గానీ- క్రికెటింగ్ స్పిరిట్ ఉందని చెప్పారు. పాకిస్తానీయులకు క్రీడా స్ఫూర్తి అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్‌లల్లో పరాజయాన్ని చవి చూసిన ప్రతీసారీ- గోడకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ కావడం తమకు అలవాటేనని సమాధానం ఇచ్చారు. బౌన్స్ బ్యాక్ కావడం అనేది పాకిస్తానీలకు ఫన్నీ హ్యాబిట్ అని చెప్పారు. జింబాబ్వే జట్టు నిజంగా బాగా ఆడిందని కితాబిచ్చారు.

రోడ్‌షోలో..
2016లో జింబాబ్వే రాజధాని హారారెలోని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించిన ఓ కామెడీ షో సందర్భంగా ఆ దేశ ప్రజలను అవమానపరిచింది పాకిస్తాన్. హరారె రోడ్‌షోలో మిస్టర్ బీన్ అలియాస్ రొమన్ అట్కిన్సన్‌కు బదులుగా ఆయన రూపాన్ని పోలిన పాకిస్తాన్ కమేడియన్ ఆసిఫ్ మహ్మద్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతణ్నే రియల్ మిస్టర్ బీన్ అనుకున్నారు జింబాబ్వే ప్రజలు. అతనితో చేతులు కలపడానికి, ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు. దీనికోసం 10 డాలర్లను చెల్లించారు. ఆ తరువాత నిజం తెలిసి లబోదిబోమన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications