Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌పై చారిత్రాత్మక విజయం..ఐర్లాండ్ హెడ్ కోచ్ రాజీనామా!

ఐర్లాండ్ హెడ్ కోచ్ హెన్రీచ్ మలాన్ తన పదవికి రాజీనామా చేశాడు. భారత్‌పై రెండు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న గంటల వ్యవధిలోనే మలాన్ తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. 45 ఏళ్ల ఈ సౌతాఫ్రికా కోచ్ పదవి కాలం 2027 వరకు ఉంది. కానీ వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీ క్వాలిఫికేషన్స్‌కు ముందు జట్టుకు కొత్త కోచ్ రావడం ఉత్తమమని మలాన్ భావించాడని ఐర్లాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.

2022 జనవరిలో మలాన్ ఐర్లాండ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతని పర్యవేక్షణలో ఐర్లాండ్ 2022, 2024, 2026 టీ20 ప్రపంచకప్ టోర్నీలకు అర్హత సాధించింది. 2022 టీ20 ప్రపంచకప్‌‌లో ఆ టోర్నీ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా టెస్ట్‌ల్లో మూడు విజయాలను అందుకుంది.

ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనే వైభవ్ సూర్యవంశీని ఆడించాలి: సునీల్ గవాస్కర్

ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనే వైభవ్ సూర్యవంశీని ఆడించాలి: సునీల్ గవాస్కర్

గొప్ప ప్రయాణం..

ఐర్లాండ్‌తో కోచ్ తన ప్రయాణంపై మలాన్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఐర్లాండ్ ఆటగాళ్లు, సిబ్బంది, ఐరిష్ క్రికెట్ కమ్యూనిటీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా కుటుంబానికి, నాకు ఇక్కడ నివసించడం ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఐరిష్ క్రికెట్‌తో మేం గడిపిన ఈ సమయాన్ని మేం జీవితాంతం గుర్తుంచుకుంటాం.

Ireland Head Coach Heinrich Malan Resigns Just Hours After Historic 2-0 T20I Series Sweep Against India

మైదానంలో సాధించిన విజయాల విషయానికి వస్తే.. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌పై మేం సాధించిన చారిత్రాత్మక టీ20 వరల్డ్ కప్ విజయం, అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌పై సాధించిన మా తొలి టెస్ట్ విజయం, బెల్‌ఫాస్ట్‌లో జింబాబ్వేపై సాధించిన తొలి హోమ్ టెస్ట్ విజయం, అలాగే స్వదేశంలో భారత్‌పై సాధించిన చారిత్రాత్మక టీ20 సిరీస్ విజయం, పాకిస్తాన్, వెస్టిండీస్, సౌతాఫ్రికాలను ఓడించడాన్ని మేము ఎంతో గర్వంగా గుర్తుచేసుకోవచ్చు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లకు నిరంతరం గట్టి పోటీనిస్తూ, వారిని ఓడించే మా సామర్థ్యం వల్లే టీ20 వరల్డ్ కప్‌లకు నేరుగా అర్హత సాధించగలిగాం'అని హెన్రీచ్ మలాన్ చెప్పుకొచ్చాడు.

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

IND vs IRE: ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం!

భారత్‌‌కు షాకచ్చిన ఐర్లాండ్..

సొంతగడ్డపై భారత్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. జై మూండ్రా సంచలన ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమిపాలైంది. తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిన భారత్.. రెండో టీ20లో 1 పరుగుతో ఓటమిపాలైంది. క్రికెట్ చరిత్రలోనే భారత్‌పై ఐర్లాండ్ సిరీస్ విజయం సాధించడం ఇదే తొలిసారి.

Story first published: Monday, June 29, 2026, 18:25 [IST]
Other articles published on Jun 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+