Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్!

ఐర్లాండ్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్థాన్‌తో దుబాయ్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2018లో టెస్ట్ హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం నిరీక్షించింది.

6 ఏళ్ల నిరీక్షణ తర్వాత అఫ్గాన్‌పై విజయం సాధించి టెస్ట్‌ల్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 111 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఐర్లాండ్.. 31.3 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ ఆండీ బల్బీర్నీ(96 బంతుల్లో 5 ఫోర్లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. లోర్కన్ టక్కర్(57 బంతుల్లో 2 ఫోర్లతో 27 నాటౌట్) పర్వాలేదనిపించాడు.

Ireland create history as win first-ever Test vs Afghanistan in one-off Test

అఫ్గాన్ బౌలర్లలో నిజత్ మసూద్, జియా ఉర్ రెహ్మాన్ తలో వికెట్ తీయగా.. నవీద్ జడ్రాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీమ్ జడ్రాన్(83 బంతుల్లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీతో రాణించగా.. కరీమ్ జనత్(78 బంతుల్లో 6 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. మార్క్ అడైర్(5/39) ఐదు వికెట్లు తీయగా.. క్రైగ్ యంగ్, కర్టీస్ కాంఫెర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బారీ మెక్‌కార్తీ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ 263 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్(89 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. కర్టిస్ కాంఫెర్(49), లోర్కాన్ టక్కర్(46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అఫ్గాన్ బౌలర్లలో జియా ఉర్ రెహ్మాన్(5/64) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.

108 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 218 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది(55), రెహ్మనుల్లా గుర్బాజ్(46) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రైగ్ యంగ్ మూడేసి వికెట్లు తీసారు.

Story first published: Friday, March 1, 2024, 21:53 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+