For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IRE vs WI: 16 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 29 ఏళ్ల రికార్డ్ బద్దలు

సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆల్‌టైమ్ వన్డే రికార్డును వెస్టిండీస్ బ్యాటర్ మాథ్యూ ఫోర్డ్ సమం చేశాడు. 10 ఏళ్ల తర్వాత ఈ అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డ్‌ ఏబీ డివిలియర్స్ పేరిటనే ఉంది. 2015లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి ఈ రికార్డ్ నమోదు చేశాడు.

అప్పటి నుంచి ఈ రికార్డ్ చెక్కు చెదరకుండా ఉంది. తాజాగా ఈ రికార్డ్‌ను మాథ్యూ ఫోర్డ్ సమం చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్.. ఐర్లాండ్ పర్యటనలో ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో వన్డేలో మాథ్యూ ఫోర్డ్ ఈ ఘనతను అందుకున్నాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న మాథ్యూ ఫోర్డ్ మొత్తం 19 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య 29 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 1996లో పాకిస్థాన్‌పై జయసూర్య 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ రికార్డ్‌ను ఏబీ డివిలియర్స్ 2015లో అధిగమించగా.. తాజాగా మాథ్యూ ఫోర్డ్ బ్రేక్ చేశాడు.

IRE vs WI Matthew Forde s Explosive Knock Breaks Sanath Jayasuriya s 29-Year Record and Equals AB de Villiers

వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్లు

1.ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా): 16 బంతుల్లో 50 పరుగులు (vs వెస్టిండీస్, జొహన్నెస్‌బర్గ్, 2015)

2. మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్): 16 బంతుల్లో 50 పరుగులు (vs ఐర్లాండ్, డబ్లిన్, 2025)

3. సనత్ జయసూర్య (శ్రీలంక): 17 బంతుల్లో 50 పరుగులు (vs పాకిస్తాన్, సింగపూర్, 1996)

4. కుశాల్ పెరీరా (శ్రీలంక): 17 బంతుల్లో 50 పరుగులు (vs పాకిస్తాన్, పల్లెకెలె, 2015)

5.మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్): 17 బంతుల్లో 50 పరుగులు (vs శ్రీలంక, క్రైస్ట్‌చర్చ్, 2015)

6. లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లాండ్): 17 బంతుల్లో 50 పరుగులు (vs నెదర్లాండ్స్, ఆమ్‌స్టర్‌వీన్, 2022)

వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన భారత బ్యాటర్లు

1.అజిత్ అగార్కర్: 21 బంతుల్లో 50 పరుగులు (vs జింబాబ్వే, రాజ్‌కోట్, 2000)

2. మహమ్మద్ అజారుద్దీన్: 21 బంతుల్లో 50 పరుగులు (vs న్యూజిలాండ్, వడోదర, 1988)

3. కపిల్ దేవ్: 22 బంతుల్లో 50 పరుగులు (vs వెస్టిండీస్, బెర్బిస్, 1983)

4. వీరేందర్ సెహ్వాగ్: 22 బంతుల్లో 50 పరుగులు (vs కెన్యా, పార్ల్, 2001)

5. రాహుల్ ద్రవిడ్: 22 బంతుల్లో 50 పరుగులు (vs న్యూజిలాండ్, హైదరాబాద్, 2003)

6. యువరాజ్ సింగ్: 22 బంతుల్లో 50 పరుగులు (vs బంగ్లాదేశ్, ఢాకా, 2004)

వర్షంతో మ్యాచ్ రద్దు
వెస్టిండీస్ వర్సెస్ ఐర్లాండ్‌ మధ్య జరిగిన రెండో వన్డే వర్షం కారణంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 352 పరుగులు చేసింది. కీసీ కార్టీ(109 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 102) సెంచరీతో చెలరేగగా.. మాథ్యూ ఫోర్డ్(19 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 58), షైహోప్(57 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 49)కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో లియామ్ మెక్‌కార్తీ(3/66) మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్(2/89), బార్రీ మెక్‌కార్తీ(2/68) రెండేసి వికెట్లు తీసారు.

Story first published: Friday, May 23, 2025, 23:17 [IST]
Other articles published on May 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+