Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IRE vs PAK: అఫ్గాన్ అభిమానితో షాహిన్ అఫ్రిది గొడవ.. లాక్కెళ్లిన సెక్యూరిటీ!(వీడియో)

పాకిస్థాన్ స్థార్ పేసర్ షాహిన్ అఫ్రిదితో ఓ అఫ్గానిస్థాన్ అభిమాని గొడవపడ్డాడు. ఈ ఇద్దరూ అసభ్య పదజాలంతో తిట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌ అయ్యింది.

ప్రస్తుతం ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ఆదివార జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతోగెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.

IRE vs PAK Shaheen Afridi in extreme verbal fight with fan video goes viral

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 193 పరుగులు చేసింది. లోర్కన్ టెక్టర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. గరెత్ డెలనీ(10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది(3/49) మూడు వికెట్లు తీయగా.. అబ్బాస్ అఫ్రిదీ(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అమీర్, నసీమ్ షా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసి గెలుపొందింది. కెప్టెన్ బాబర్ ఆజామ్ డకౌటవ్వగా.. ఆజామ్ ఖాన్(10 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 30 నాటౌట్) ధాటిగా ఆడాడు.

ఈ విజయానంతరం షాహిన్ అఫ్రిది మ్యాచ్‌కు హాజరైన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడంతో పాటు సెల్ఫీలు ఇచ్చాడు. ఈ సమయంలో అఫ్గాన్‌కు చెందిన ఓ అభిమాని షాహిన్ అఫ్రిదిని తిట్టాడు. దాంతో సీరియస్ అయిన అతను సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి సదరు అభిమానిని బయటకు తీసుకెళ్లేలా చేశాడు. ఇద్దరి మధ్య ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేకున్నా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సిరీస్‌ ఫలితాన్ని నిర్ణయించే మూడో టీ20 మంగళవారం జరగనుంది.

టీ20 ప్రపంచకప్ 2024‌కు సన్నాహకంగా పాకిస్థాన్ ఈ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తమ ఆటగాళ్ల ప్రదర్శన, ఫిట్‌నెస్ లెవెల్స్‌ను పరిగణలోకి తీసుకొని టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఎంపిక చేయనుంది.

Story first published: Monday, May 13, 2024, 14:02 [IST]
Other articles published on May 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+