Irani Trophy: శతక్కొట్టిన సర్ఫరాజ్.. రంజీ విజేతను వణికించిన ఉమ్రాన్, కుల్దీప్ సేన్!

రాజ్‌కోట్: భారత దేశవాళీ సంచలన సర్ఫరాజ్ ఖాన్(126 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 126) మరోసారి దుమ్మురేపాడు. తనదైన బ్యాటింగ్‌తో శతక్కొట్టాడు. ఇరానీ ట్రోఫీలో భాగంగా రంజీ ట్రోఫీ 2022 విజేత సౌరాష్ట్రతో జరుగుతున్న రెడ్ బాల్ మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఈ సెంచరీ బాదాడు. వన్డే తరహాలో 100 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా తెలుగు క్రికెటర్, కెప్టెన్ హనుమ విహారి(145 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 49 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది.
టాప్-3 విఫలమైనా..
టాప్-3 బ్యాటర్లు అభిమన్యూ ఈశ్వరన్(3), మయాంక్ అగర్వాల్(11), యశ్ ధుల్(5) విఫలమైనా.. సర్ఫరాజ్, విహారి 197 పరుగుల భాగస్వామ్యంతో దూసుకెళ్తున్నారు. సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనాద్కత్ రెండు వికెట్లు తీయగా.. చేతన్ సకారియా ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రంజీ చాంపియన్ సౌరాష్ట్ర 24.5 ఓవర్లలో 98 పరుగులకు కుప్పకూలింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేశ్ కుమార్(4/23) నాలుగు వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ సేన్(3/41), ఉమ్రాన్ మాలిక్(3/25) మూడేసి వికెట్లతో సౌరాష్ట్ర పతనాన్ని శాసించారు.
పెవిలియన్‌కు క్యూ..
ఈ పేస్ త్రయం ధాటికి సౌరాష్ట్ర బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అర్పిత్ వసవాడ(22), ధర్మెంద్రసిన్ జడేజా(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హర్విక్ దేశాయ్, చిరాగ్ జానీ డకౌట్ కాగా స్నెల్ పటేల్ 4 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 1, షెల్డన్ జాక్సన్ 2, ప్రెరక్ మన్కండ్ 9, పార్త్ భట్ 1 పరుగు చేసి పెవిలియన్ చేరారు. ప్రస్తుతం రెస్టాఫ్ ఇండియా 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇరానీ కప్ చరిత్రలోనే..
ఇరానీ కప్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 1995లో ముంబైపై రెస్ట్ ఆఫ్ ఇండియా సాధించిన 99 పరుగుల రికార్డును తుడిచేసింది సౌరాష్ట్ర. గత 24 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో సర్ఫరాజ్ ఖాన్ 125 సగటుతో 2200 పై చిలుకు పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా 43 ఇన్నింగ్స్‌ల్లో 82.63 సగటుతో 2892 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications