Irani Cup 2024: వారెవ్వా వాటే క్యాచ్.. నోరెళ్లబెట్టిన పృథ్వీ షా !
టీమిండియా యువ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ స్టన్నింగ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ 2024లో రెస్టాఫ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న దేవదత్ పడిక్కల్.. రంజీ ఛాంపియన్ ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అతని సూపర్ ఫీల్డింగ్‌కు ముంబై ఓపెనర్ పృథ్వీ షా(4) నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రెస్టాఫ్ ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై ముందుగా బ్యాటింగ్ చేసింది. ముఖేష్ కుమార్ వేసిన మూడో ఓవర్‌లోనే పృథ్వీ షా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

రెస్టా ఆఫ్ ఇండియా పేసర్ ముఖేష్ కుమార్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని పృథ్వీ షా కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి మూడో స్లిప్ ఫీల్డర్ దేవదత్ పడిక్కల్‌కు దూరంగా వెళ్లగా.. అతను కుడివైపు డైవ్ చేసి బంతిని అందుకున్నాడు. అచ్చం చేప పిల్లలానే డైవ్ చేసిన దేవదత్ పడిక్కల్ గాల్లోనే బంతిని ఒడిసి పట్టుకున్నాడు.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వారెవ్వా పడిక్కల్.. వాటే క్యాచ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్యాచ్‌తో పృథ్వీ షాకు సాయి బాబా కనిపించాడని సెటైర్లు పేల్చుతున్నారు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన హార్దిక్ తోమర్(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. ముఖేష్ కుమార్ వేసిన అదే ఓవర్ నాలుగో బంతికే హార్దిక్ తోమర్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో ముంబై మూడు బంతుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ అజింక్యా రహానే(12 బ్యాటింగ్)తో కలిసి మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే(19 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.
FLYING DEVDUTT PADIKKAL. 🥵
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 1, 2024
- An absolute stunner in slips to dismiss Prithvi Shaw. 🔥 pic.twitter.com/Qa8j8ESMc6
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications