For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్.. తృటిలో చేజారిన ‘ద్వి’ శతకం..!

రంజీ ట్రోఫీ 2024 ఛాంపియన్ ముంబై‌తో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(292 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 191) తృటిలో ద్విశతకం చేజార్చుకోగా.. యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్(121 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 93) సెంచరీ అందుకోలేకపోయాడు.

మూడు పరుగుల వ్యవధిలోనే ఈ ఇద్దరూ ఔటవ్వగా.. మరో 23 పరుగుల వ్యవధిలోనే రెస్టాఫ్ ఇండియా చివరి 5 వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ, తనూష్ కోటియన్ మూడేసి వికెట్లు తీయగా.. మోహిత్ అవస్థి రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ జునేద్ ఖాన్ ఓ వికెట్ తీసాడు. దాంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

Irani Cup 2024 Abhimanyu Easwaran misses double-hundred and Dhruv Jurel fell short of a century

289/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా.. నిలకడగా తమ ఆటను కొనసాగించింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు అభిమన్యు ఈశ్వరన్.. ధ్రువ్ జురెల్ సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లను గౌరవిస్తూ వీలు చిక్కిన బంతులను మాత్రమే బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో జురెల్ 68 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ డబుల్ సెంచరీ దిశగా సాగగా.. ధ్రువ్ జురెల్ శతకానికి చేరువయ్యాడు. అయితే షమ్స్ మూలానీ వరుస ఓవర్లలో ధ్రువ్ జురెల్‌, అభిమన్యు ఈశ్వరన్‌లను పెవిలియన్ చేర్చి.. రెస్టాఫ్ ఇండియా పతనాన్ని శాసించాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 165 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనవ్ సుతార్(6), యశ్ దయాల్(6), ప్రసిధ్ కృష్ణ(0), ముఖేష్ కుమార్(0) దారుణంగా విఫలమయ్యారు.

121 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై 11 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే(14) విఫలమవ్వగా.. పృథ్వీ షా(37 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 50 బ్యాటింగ్), హార్దిక్ థామోర్(5 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు. ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 141 ఓవర్లలో 537 పరుగులు చేసింది.

సర్ఫరాజ్ ఖాన్(286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లతో 222 నాటౌట్) అజేయ ద్విశతకంతో రాణించగా.. తనూష్ కోటియన్(124 బంతుల్లో 6 ఫోర్లతో 64) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్(5/110) ఐదు వికెట్లతో చెలరేగగా.. యశ్ దయాల్(2/89), ప్రసిధ్ కృష్ణ(2/102) రెండేసి వికెట్లు పడగొట్టారు. సరాన్ష్ జైస్(1/82)కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Friday, October 4, 2024, 14:43 [IST]
Other articles published on Oct 4, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+