న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: చెన్నై లక్కీ ఎస్కేప్.. రాజస్థాన్ చెత్త రికార్డ్..13 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైమ్!

IPL: Year Wise Standings for RR and CSK from 2008 to 2020

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు తమ పోరాటాన్ని ముగించి ఇంటిదారి పట్టగా.. మరో నాలుగు జట్లు మూడు ప్లేఆఫ్ స్థానాల కోసం పోటీపడుతున్నాయి. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశకు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ మ్యాచ్ ఫలితంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించే మరో జట్టు ఏదో తెలియనుంది.

ఇక ఆదివారం కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో మ్యాచ్ ముందు వరకు ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఈ మ్యాచ్‌లో 60 పరుగులతో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా పాయింట్స్ టేబుల్లో అట్టుడుగు స్థానానికి పడిపోయింది. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ కూడా రాజస్థాన్ ఆఖరి స్థానంలో నిలవలేదు. తొలిసారి.. అది అద్భుతంగా రాణించిన తర్వాత కూడా అనూహ్య ఓటమితో ఆట్టడుగు స్థానానికి పడిపోయింది. తద్వార పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన తొలి మాజీ ఛాంపియన్‌గా రాజస్థాన్ అపప్రదను మూటగట్టుకుంది.

వాస్తవానికి గత రెండు మ్యాచ్‌ల్లోనూ 196 (ముంబైపై), 186 (పంజాబ్‌పై) పరుగుల లక్ష్యాన్ని కొన్ని బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించేసిన రాజస్థాన్ రాయల్స్.. కోల్‌కతా‌పై కూడా చెలరేగిపోతుందని అంతా ఊహించారు. కానీ.. నెట్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవాలని ఆతృతలో ధాటిగా ఆడి ఆ జట్టు మూల్యం చెల్లించుకుంది. ఏ మాత్రం ఊహించని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది.

టైటిల్ గెలిచి ఐపీఎల్ ప్రస్థానం మొదలుపెట్టిన రాజస్థాన్ ఆఖరికి అట్టడుగున నిలిచింది. 2008 టైటిల్ గెలిచిన రాజస్థాన్.. 2009, 2010, 2011 సీజన్లలో 6, 7, 6 స్థానాల్లో నిలిచింది. 2012, 2013, 2014, 2015 సీజన్లలో 7, 3, 5, 4 స్థానాలకు పరిమితమైంది. ఆ తర్వాత రెండేళ్లు నిషేధం ఎదుర్కొన్న ఆర్ ఆర్.. 2018 సీజన్ పునరాగమనంలో మెరుగైన ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది. గత సీజన్‌లో ఏడో స్థానానికి పరిమితమైన ఆ జట్టు.. ఈ సీజన్‌లో రాణించినా నెట్‌రన్ రేట్ కారణంగా అట్టడుగు స్థానానికి పరిమితమైంది.

పది సీజన్లు.. మూడుసార్లు విజేత.. ఐదుసార్లు రన్నరప్​.. ఓసారి సెమీస్​... మరోసారి ప్లే ఆఫ్స్​.. ఐపీఎల్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జైత్రయాత్ర ఇది. కానీ ఈ సీజన్‌లో ఆ జట్టు ఏన్నడూ లేని విధంగా విఫలమైంది. ప్రతీ సీజన్‌లో కనీసం ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ జట్టు.. ఈ సారి ఏడో స్థానానికే పరిమితమైంది. ఆఖర్లో హ్యాట్రిక్ విజయాలందుకోవడంతో ఆ స్థానం దక్కింది లేకుంటే అట్టుడుగు స్థానంలో నిలిచేది.

CSK vs KXIP trolls: అయిపాయే.. పంజాబ్‌ను చెన్నై అస్సాం తీసుకుపాయే.. పాపం ప్రీతీ జింటా!CSK vs KXIP trolls: అయిపాయే.. పంజాబ్‌ను చెన్నై అస్సాం తీసుకుపాయే.. పాపం ప్రీతీ జింటా!

Story first published: Monday, November 2, 2020, 12:38 [IST]
Other articles published on Nov 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X