Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌తో పాక్‌ లీగ్‌కు పోలికా? కాలి గోటికి కూడా సరిపోదు! ఆటగాళ్ల జీతాలు, ప్రైజ్‌మనీ ఎన్నో రెట్లు ఎక్కువ!

IPL vs PSL Prize Money Comparison, Players Salary, Revenue And Other Differences

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ డొమెస్టిక్ టీ20 లీగ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ప్రపంచవ్యాప్తంగా క్యాష్ రిచ్ లీగ్‌కు క్రేజ్ ఉంది. ఎంతలా అంటే ఐపీఎల్ జరిగినన్ని రోజులు ఇంటర్నేషనల్ క్రికెట్ మొత్తం ఆగిపోతుంది. ఆయా దేశాల ఆటగాళ్లంతా భారత్‌కు క్యూ కడతారు. డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు.. క్రికెట్ అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్. తగ్గేదేలే అన్నట్లు లీగ్ సాగుతోంది. ఇక ఈ ఒక్క లీగ్‌తో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల వ్యాపారం నడుస్తోంది. గత 14 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిన ఐపీఎల్.. 15వ ఎడిషన్‌కు ముస్తాబవుతోంది.

రిచెస్ట్ బోర్డుగా..

రిచెస్ట్ బోర్డుగా..

ఐపీఎల్ కారణంగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్‌బోర్డుగా నిలిచింది. ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఐపీఎల్‌ను చూసి ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ స్టార్ట్ చేయగా.. పాకిస్థాన్ పీఎస్‌ఎల్‌ను మొదలుపెట్టింది. ఇతర దేశాలు కూడా ఈ తరహా లీగ్స్‌ను నిర్వహిస్తున్నాయి. అయితే అవన్నీ ఐపీఎల్ సాధించినంత సక్సెస్ సాధించలేకపోయాయి. ముఖ్యంగా మన పొరగు దేశం పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ అయితే ఐపీఎల్ కాలి గోటికి కూడా సరిపోదు. ప్రైజ్‌మనీ, ఆటగాళ్ల జీతాలు, రెవెన్యూ, వ్యూయర్ షిప్, క్రేజ్... ఇలా ఎందులో చూసుకున్నా ఐపీఎల్‌కు పీఎస్‌ఎల్ సరితూగదు. ఈ రెండు లీగ్‌లను పోల్చి చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఒక్క మ్యాచ్‌కు రూ. 54.5 కోట్లు..

ఒక్క మ్యాచ్‌కు రూ. 54.5 కోట్లు..

టీమ్స్:

ఐపీఎల్‌లో 10 జట్లు పోటీ పడుతుండగా.. పీఎస్‌ఎల్‌లో కేవలం 6 జట్లతోనే జరుగుతుంది.

రెవెన్యూ..

ఐపీఎల్: ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌కు బీసీసీఐ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌ నుంచి రూ.54.5 కోట్లు ఆర్జిస్తుంది. ఇక టైటిల్ స్పాన్సర్‌షిప్, అసోసియేట్ స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయం, గేట్ రెవెన్యూ అదనం.

పీఎస్‌ఎల్: ఇటీవల ముగిసిన సీజన్‌లో పీసీబీ ఒక్క మ్యాచ్‌కు రూ.38.46 లక్షలు ఆర్జించింది.

ఆటగాళ్ల జీతాలు..

ఆటగాళ్ల జీతాలు..

ఐపీఎల్‌లో ఆటగాళ్ల వేతనాలల్లో ఒక్కో ప్లేయర్ గరిష్టంగా రూ.17 కోట్లు అందుకోనుండగా.. కనిష్టంగా రూ.20 లక్షలు తీసుకుంటున్నారు. కేఎల్ రాహుల్‌ను రూ.17 కోట్లకు లక్నో రిటైన్ చేసుకోగా.. పదుల సంఖ్యలో ఇతర ఆటగాళ్లు రూ.10 కోట్లకు పైగానే కాంట్రాక్టులు అందుకున్నారు. ఇక పీఎస్‌ఎల్‌లో టాప్ ప్లేయర్ జీతం రూ.1.27 కోట్లు. బాబార్ ఆజామ్, కీరన్ పొలార్డ్ వంటి ప్లాటినమ్ కేటగిరికి చెందిన ఆటగాళ్లకే ఈ జీతం. భారత్‌లోని అనామక ప్లేయర్ దీని కంటే 9 రెట్లు ఎక్కువగా ఆర్జిస్తున్నాడు.

టీమ్ పర్స్..

ఐపీఎల్‌లో ప్రతీ టీమ్ పర్స్ రూ.90 కోట్లు కాగా.. 10 జట్లది కలిపి రూ.900 కోట్లు. ఇక పీఎస్‌ఎల్‌లో ఇంకా డ్రాఫ్ట్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

 ప్రైజ్ మనీ:

ప్రైజ్ మనీ:

ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్‌మనీ రూ. 20 కోట్లు ఇస్తుండగా.. పీఎస్‌ఎల్ విజేతకు కేవలం రూ. 3.5 కోట్లే అందిస్తున్నారు.

ఐపీఎల్‌లో రన్నరప్‌కు రూ.12.5 కోట్లు ఇస్తుండగా.. పీఎస్‌ఎల్‌లో రూ.1.5 కోట్లు ఇస్తున్నారు.

ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి పీఎస్ఎల్‌లో రూ. 14.1 లక్షలు కాగా... ఐపీఎల్‌లో రూ. 10 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఈ ఒక్కటి మినహా అన్నింటిలోనూ ఐపీఎల్ ప్రైజ్‌మనే ఎక్కువ. హయ్యెస్ట్ రన్ స్కోరర్‌కు ఐపీఎల్‌లో రూ.10 లక్షలు, పీఎస్‌ఎల్‌లో రూ. 3.5 లక్షలు, హయ్యెస్ట్ వికెట్ టేకర్‌కు పీఎస్‌ఎల్‌లో రూ. 3.75 లక్షలు, ఐపీఎల్‌లో రూ. 10 లక్షలు ఇస్తున్నారు.

Story first published: Tuesday, March 15, 2022, 18:04 [IST]
Other articles published on Mar 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+