ఆర్‌సీబీలోకి హార్దిక్ పాండ్యా? డీకేతో రహస్య భేటీ!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ 2026 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)లోకి వెళ్లనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన అనంతరం ఆర్‌సీబీ మెంటార్ దినేశ్ కార్తీక్‌ను హార్దిక్ పాండ్యా రహస్యంగా కలవడం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది.
ప్రస్తుతం ఈ ఇద్దరి భేటికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన మరుసటి రోజే(జూన్ 1న) అహ్మదాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ భేటి అయ్యారు. ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌లో దినేష్ కార్తీక్ మెంటార్‌గా.. బ్యాటింగ్ కోచ్‌గా కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్రేడింగ్ విండో ద్వారా..
ట్రేడింగ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను ఆర్‌సీబీలోకి తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభమైందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచి వరుసగా రెండోసారి టైటిల్ అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత వరుసగా రెండుసార్లు కప్పు గెలిచిన మూడో జట్టుగా ఆర్‌సీబీ చరిత్రకెక్కింది.

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 9వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపర్చింది. రెండేళ్ల క్రితం రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా నియమించింది.
మానసిక ఒత్తిడితో..
గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకొచ్చి మరీ ఈ బాధ్యతలు అప్పగించింది. కానీ జట్టులోని సీనియర్లతో పాటు అభిమానులు ఈ నిర్ణయాన్ని స్వాగతించలేదు. దాంతో హార్దిక్ పాండ్యాకు సీనియర్ల నుంచి సహకారం కొరవడింది. సీనియర్లతో సమన్వయలోపం, వరుస పరాజయాలతో మానసికంగా అలసిపోయిన హార్దిక్ పాండ్యా.. సీజన్ మధ్యలోనే ముంబై ఇండియన్స్ వీడేందుకు సిద్దమయ్యాడు.
ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి కూడా వెల్లడించాడని పీటీఐ పేర్కొంది. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ పాండ్యా కొనసాగలేకపోతున్నాడని, అతనిపై విపరీతమైన ఒత్తిడి నెలకొందని, దాంతోనే జట్టును వీడాలని హార్దిక్ పాండ్యా నిర్ణయించుకున్నాడని పీటీఐ తెలిపింది.
ఆర్‌సీబీలోకి హార్దిక్ వస్తే..
ఆర్‌సీబీలో ఇప్పటికే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా ఉన్నాడు. వరల్డ్ బెస్ట్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఆర్‌సీబీకి మారితే ఆ జట్టు మరింత బలంగా తయారవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2020 విజయం తర్వాత ఒక్క టైటిల్ అందుకోలేకపోయిన ముంబై ఇండియన్స్ కొత్త సారథి కోసం అన్వేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications