Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL చరిత్రలోనే టాప్ 10 ఫాస్టెస్ట్ సెంచరీలు.. అగ్రస్థానం ఎవరిదంటే?

ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట.. సిక్సర్ల మోత. పరుగుల విధ్వంసానికి మారుపేరైన ఐపీఎల్‌లో ఇప్పటికే ఎన్నో శతకాలు నమోదయ్యాయి. టీ20 ఫార్మాట్‌లో సెంచరీ చేయడమే అద్భుతం అంటే.. ఈ ధనాధన్ లీగ్‌లో కొందరు ఆటగాళ్లు రెప్పపాటు సమయంలోనే సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 30 బంతుల్లోనే సెంచరీ బాది వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు.

ఈ రికార్డ్ నమోదై 13 ఏళ్ల అవుతున్నా మరే ఆటగాడు ఈ ఘనతను అధిగమించలేదు. కనీసం సమం కూడా చేయలేదు. 2013లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేరు. పుణె వారియర్స్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో గేల్ 30 బంతుల్లో శతకం సాధించడంతో పాటు 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడి వ్యక్తిగత అత్యధిక స్కోర్‌గా.. ఫాస్టెస్ట్ సెంచరీగా ఈ ఇన్నింగ్స్ నిలిచిపోయింది.

IPL Top 10 Fastest Centuries Chris Gayle and Vaibhav Sooryavanshi Lead the Historical Chart

క్రిస్ గేల్ రికార్డు తర్వాత టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న అతను.. గతేడాది గుజరాత్‌ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తృటిలో గేల్ రికార్డ్‌ను అధిగమించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తాజా సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే మరో సెంచరీ బాదాడు. ఈ ప్రదర్శనలతో వైభవ్ సూర్యవంశీ.. వేగవంతమైన ఐపీఎల్ శతకాల జాబితాలో రెండో, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాడు.

2010లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యూసుఫ్ పఠాన్ 37 బంతుల్లో సెంచరీ బాదగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ గత సీజన్‌లో 37 బంతుల్లో శతకంతో చెలరేగాడు. డేవిడ్ మిల్లర్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర బ్యాటర్లు కూడా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టాప్ 10 సెంచరీల జాబితాలో ఉన్నారు.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టాప్ 10 సెంచరీల జాబితా:

క్రిస్ గేల్ (2013) 30 బంతులు

వైభవ్ సూర్యవంశీ (2025) 35 బంతులు

వైభవ్ సూర్యవంశీ (2026) 36 బంతులు

యూసుఫ్ పఠాన్ (2010) 37 బంతులు

హెన్రిచ్ క్లాసెన్ (2025) 37 బంతులు

డేవిడ్ మిల్లర్ (2013) 38 బంతులు

ట్రావిస్ హెడ్ (2024) 39 బంతులు

ప్రియన్ష్ ఆర్య (2025) 39 బంతులు

అభిషేక్ శర్మ (2025) 40 బంతులు

విల్ జాక్స్ (2024) 41 బంతులు

Story first published: Saturday, May 16, 2026, 15:28 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+