Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫిఫా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ ప్రదర్శన అదరహో!!

FIFA World Cup 2022 Qualifiers: India Hold Asian Champions Qatar to 0-0 Draw

దోహా: భారత ఫుట్‌బాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ కంటే 41 స్థానాలు మెరుగ్గా ఉన్న ఖతార్‌ జట్టుకు అసలు అవకాశమే ఇవ్వకుండా నిలువరించింది. మంగళవారం ఖతార్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ అదరహో అనే ప్రదర్శన చేసాడు. ఈ డ్రాతో క్వాలిఫయర్స్‌లో భారత్ తమ మొదటి పాయింట్‌ను ఖాతాలో చేర్చుకుంది.

తొలి మ్యాచ్‌లో ఓమన్ చేతిలో ఓటమి పాలైన భారత్.. ఆసియా చాంపియన్, ప్రపంచ 62వ ర్యాంకర్ ఖతార్‌పై మాత్రం బాగా ఆడింది. మ్యాచ్‌కు ముందు ఖతార్‌తో భారత్ డీ కొడుతుందంటే ఎంత తేడాతో ఓడుతుందనున్నారు అందరూ. కానీ.. భారత్ అంచనాలను తలక్రిందులు చేసింది. ఖతార్‌ను ఒక్క గోల్ కూడా కొట్టకుండా నిలువరించడం విశేషం.

అనారోగ్యం కారణంగా స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునిల్ ఛెత్రీ దూరమైన ఈ మ్యాచ్‌లో.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ మొత్తంలో ఖతార్ స్ట్రయికర్‌లు 27 సార్లు దాడులు చేస్తే.. వాటిని సంధు అద్భుతంగా అడ్డుకున్నాడు. ముఖ్యంగా డజనుకు పైగా షాట్లను పోస్ట్‌కు అతిసమీపంలో అడ్డుకొని సత్తా చాటాడు. ఈ ఫలితంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ర్యాంకింగ్స్‌లో భారత్ 103వ స్థానంలో ఉండగా.. ఖతార్‌ 62వ స్థానంలో ఉంది.

Story first published: Wednesday, September 11, 2019, 10:03 [IST]
Other articles published on Sep 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+