‘వింబుల్డన్’కు వెయ్యి కోట్ల ఇన్సూరెన్స్.. మరీ ఐపీఎల్‌కు..?

ముంబై: కరోనా కారణంగా ఈ ఏడాది జూన్‌లో జరగాల్సిన వింబుల్డన్ టెనిస్ టోర్నమెంట్ రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ నిర్వహకులకు ఇన్సూరెన్స్.. భారీ నష్టాల నుంచి గట్టెక్కించింది. అవును.. భీమా సౌకర్యం కింద ఈ పోటీలను నిర్వహించే ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు 141 మిలియన్ డాలర్ల (దాదాపు 1,079 కోట్ల రూపాయలు) సొమ్ము అందనుంది. వాస్తవానికి ఈ టోర్నీ జరిగితే 250 మిలియన్ డాలర్లు (దాదాపు 23,100 కోట్ల రూపాయలు) వచ్చేవి. అయితే కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడా టోర్నీలు రద్దవ్వడమో.. వాయిదా పడటమో జరుగుతుంది. టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.

17 ఏళ్లుగా భీమా..
ఇక రెండో ప్రపంచ యుద్ధానంతరం వింబుల్డన్ పోటీలను రద్దు చేయడం ఇదే మొదటి సారి. 2003లో సార్స్ వచ్చినప్పుడు వింబుల్డన్ పోటీలకు భీమా తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జీవిత భీమా కింద 2 మిలియన్ డాలర్లు ప్రీమియం కింద చెల్లిస్తూ వస్తున్నారు. భీమా తీసుకున్న 17 ఏళ్ల తర్వాత మొదటి సారి వింబుల్డన్ పోటీలు వాయిదా పడ్డాయి.

ఐపీఎల్‌కు భీమా వర్తించదు..
ఇక వింబుల్డన్ ఇన్సూరెన్స్ వ్యవహారంతో ఐపీఎల్ భీమా విషయం కూడా చర్చనీయాంశమైంది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్.. కోవిడ్-19 కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగడం సందేహంగా మారింది. ఈ క్రమంలో ఐపీఎల్ రద్దయితే భీమా అందుతుందా? అనే చర్చ ఊపందుకుంది. అయితే ఐపీఎల్ భీమా కేవలం ప్రపంచ యుద్దాలు.. టెర్రరిజంకే చేయడంతో భారీ నష్టం తప్పేలా లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలే ధృవీకరించాయి. విపత్తుల విషయంలో భీమా చేయించాలనే చర్చ జరిగినా బోర్డు అంత సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది.

జరగకుంటే భారీ నష్టం..
ఇక ఈ సీజన్ ఐపీఎల్ రద్దయితే అధికారిక బ్రాడ్ కాస్టర్ అయిన స్టార్ ఇండియా నేరుగా 3269.50 కోట్లు నష్టపోనుంది. ఇప్పటికే ఆ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1216 కోట్లు నష్టపోయింది. గత సీజన్‌లో ఐపీఎల్ ఖర్చులు రూ. 4వేల కోట్లు చేరుకున్నాయి. టైటిల్ స్పాన్సర్ షిప్ దక్కించుకున్న వీవో ఈ సీజన్ రద్దయితే రూ.400 కోట్ల నష్టాన్ని చూడనుంది. ఇప్పటికే తమ ఆటగాళ్లకు 20 శాతం వార్షిక వేతనాలు చెల్లించిన బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు.. టోర్నీ జరగకపోతే వాటిని నష్టపోనున్నాయి. ఇక ఐపీఎల్ రద్దు ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఉండనుంది. ఐపీఎల్ 2015 సీజన్ భారత జీడీపీలో రూ.1500 కోట్లు అందించింది. ఆ సీజన్‌లో సంబంధం ఉన్న మొత్తం ఆర్థిక విలువ రూ.2650 కోట్లు అని బీసీసీఐ వెల్లడించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications