Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ జరగకపోతే రూ. 7వేల కోట్లు నష్టమట..!

IPL stares at USD 1-bn value erosion on Covid-19 threat


ముంబై: కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే సుమారు రూ. 7000 కోట్లకు (ఒక బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లుతుందని గ్లోబల్ అడ్వైజరీ సంస్థ డఫ్ అండ్ ఫెల్ఫ్స్ నివేదిక తెలిపింది. 2019 సీజన్‌లో ఐపీఎల్‌ విలువ దాదాపు 6.8 బిలియన్‌ డాలర్లు( రూ.47,000 కోట్లు). ఈ సారి ఈ క్యాష్ రిచ్ లీగ్ జరగకపోతే దాని విలువ దారుణంగా పడిపోనుంది.

ఒకవేళ టోర్నీని కుదించి ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే మాత్రం బీసీసీఐ 200-350 మిలియన్‌ డాలర్లు నష్టపోతుంది. టోర్నీ మొత్తమే రద్దైతే 700-1000 మిలియన్‌ డాలర్లు కోల్పోవాల్సి ఉంటుంది. కుదించిన టోర్నీ, రద్దు చేసిన చేసిన టోర్నీ పరిస్థితులను మదింపు వేసి డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతానికైతే ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15 వరకు వాయిదా వేశారు. కరోనా వల్ల క్రికెట్‌ మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన అన్ని క్రీడా పోటీలు రద్దు కావడమో వాయిదా పడటమో జరిగిన విషయం తెలిసిందే.

'కుదించిన ఐపీఎల్‌ సీజన్‌ ద్వారా దాని విలువ 200-250 మిలియన్‌ డాలర్లు లేదా 3-5 శాతం తగ్గుతుంది. టోర్నీ మొత్తమే రద్దైతే 700-1000 మిలియన్‌ డాలర్లు లేదా 10-15 శాతం నష్టపోతుంది. ఆర్థిక మందగమనం వస్తే ఐపీఎల్‌ విలువపై ఎలాంటి ప్రభావం ఉంటుందో నివేదిక అంచనా వేయలేదు' అని డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈపీఎల్‌, లా లిగా, సెరియా ఏ, ఎన్‌బీఏ, ఛాంపియన్స్‌ లీగ్‌, ఇంకా క్రికెట్లో ద్వైపాక్షిక సిరీసులెన్నో వాయిదా పడ్డాయి.

Story first published: Friday, March 20, 2020, 21:27 [IST]
Other articles published on Mar 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+